ఈరోజు నుండి మొదలైన Samsung Galaxy Note 10 Lite సేల్

ఈరోజు నుండి మొదలైన Samsung Galaxy Note 10 Lite సేల్
HIGHLIGHTS

6GB మరియు 8GB ర్యామ్ వేరియంట్ ఎంపికలతో ఈ స్మార్ట్ ఫోన్ను ఎంచుకోవచ్చు.

గత నెలలో ఇండియాలో లాంచ్ చేయబడిన, శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ యొక్క సేల్ ఈరోజు నుండి మొదలయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్,  ఒక S-పెన్‌ తో పాటు ఫ్లాగ్‌ షిప్ హార్డ్‌ వేర్  తీసుకొచ్చింది. అంతేకాదు, ఈ ఫోన్ గొప్ప కెమేరా ఫీచర్లతో అందించబడింది. 6GB మరియు 8GB ర్యామ్ వేరియంట్ ఎంపికలతో ఈ స్మార్ట్ ఫోన్ను ఎంచుకోవచ్చు.      

శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ ధర

శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ ఆరా గ్లో, ఆరా బ్లాక్ మరియు ఆరా రెడ్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ ను అందించే ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ .38,999. ఈ ఫోన్ యొక్క 8 జీబీ ర్యామ్ వేరియంట్‌ ను రూ .40,999 ధరతో ప్రవేశపెట్టారు. ఈ గెలాక్సీ నోట్ 10 లైట్ యొక్క సేల్  ఫిబ్రవరి 3 నుండి అంటే ఈరోజు నుండి మొదలయ్యింది.

శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ : ప్రత్యేకతలు

ఈ శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ ఒక 6.7-అంగుళాల FHD + సూపర్ అమోలెడ్ ప్లస్ ఇన్ఫినిటీ-ఓ డిస్ప్లేను 2400 × 1080 పిక్సెళ్ల రిజల్యూషనుతో కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ ఫోనుకు Mali G72 MP18 జిపియుతో జత చేసిన శామ్‌ సంగ్ ఎక్సినోస్ 9 సిరీస్ 9810 చిప్‌ సెట్ ఉంది. ఈ పరికరం 6GB, 8GB LPDDR4x RAM మరియు 128GB స్టోరేజితో వస్తుంది మరియు దీని స్టోరేజిని ఒక మైక్రో SD కార్డ్ ద్వారా 512GB వరకు పెంచవచ్చు. ఆండ్రాయిడ్ 10 ఆధారితంగా ఈ ఫోన్ OneUI 2.0 తో  పనిచేస్తుంది.

ఇక ఆప్టిక్స్ విషయానికి వస్తే, ఈ శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ 12 MP డ్యూయల్ పిక్సెల్స్ వెనుక కెమెరా (ఎఫ్ / 1.7 ఎపర్చరు) తో ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంది మరియు ఈ ఫోన్ 12 MP టెలిఫోటో లెన్స్ (ఎఫ్ / 2.4 ఎపర్చర్‌) మరియు మరొక 12MP అల్ట్రా వైడ్ సెన్సార్ తో చేర్చబడింది, దీనిలో ఎపర్చరు f / 2.2 ఉంటుంది. ఈ ఫోన్‌లో సెల్ఫీ కోసం 32 MP ఫ్రంట్ కెమెరా ఉంది.

ఈ శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది మరియు ఈ ఫోన్ 4500 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 25W ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 199 గ్రాముల బరువు ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo