Samsung Galaxy M55s 5G: శామ్సంగ్ ఈరోజు తన బడ్జెట్ సిరీస్ అహఁయినా M సిరీస్ నుండి కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. అదే శామ్సంగ్ గెలాక్సీ M55s 5G స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో 20 వేల ఉప బడ్జెట్ ధరలో అందించింది. ఈ ఫోన్ ను శామ్సంగ్ ఫోన్ లలో ముందెన్నడూ చూడని ఫంకీ డిజైన్ ను చూడవచ్చు. శామ్సంగ్ సరికొత్తగా విడుదల చేసిన ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
Samsung Galaxy M55s 5G: ప్రైస్
శామ్సంగ్ గెలాక్సీ M55s స్మార్ట్ ఫోన్ ను రూ. 19,999 ధరతో విడుదల చేసింది. ఈ కొత్త ఫోన్ పై రూ. 2,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా ప్రకటించింది. ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
ఈ శామ్సంగ్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ కొత్త ఫ్యూజన్ డిజైన్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో 6.67 ఇంచ్ Super AMOLED స్క్రీన్ వుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్ మరియు 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను క్వాల్కమ్ యొక్క Snapdragon 7 Gen 1 5జి చిప్ సెట్ తో అందించింది. ఈ 8GB ర్యామ్ మరియు 8GB వర్చువల్ ర్యామ్ తో కలిపి టోటల్ 16GB ర్యామ్ ఫీచర్ ను అందిస్తుంది. ఈ ఫోన్ లో గరిష్టంగా 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంటుంది.
గెలాక్సీ M55s ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, OIS సపోర్ట్ కలిగిన 50MP మెయిన్, 8MP అల్ట్రా వైడ్ మరియు 2MP మ్యాక్రో కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్ ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ ,లో నో షేక్ వీడియోలు మరియు అన్ బ్లర్ ఫోటోలు పొందవచ్చని శామ్సంగ్ తెలిపింది.
శామ్సంగ్ ఈ ఫోన్ ను 5000mAh బిగ్ బ్యాటరీని 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ లో మంచి సెక్యూరిటీ అందించడానికి వీలుగా Samsung Knox Vault ని కూడా జత చేసింది.