ఇండియాలో విడుదలకు Samsung Galaxy M53 5G స్మార్ట్ ఫోన్..!!

HIGHLIGHTS

Samsung Galaxy M53 5G ఇండియాలో విడుదలకు సిద్దమయ్యింది

120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన సూపర్ AMOLED డిస్ప్లే

108MP క్వాడ్ రియర్ కెమెరా సెటప్

ఇండియాలో విడుదలకు Samsung Galaxy M53 5G స్మార్ట్ ఫోన్..!!

Samsung Galaxy M53 5G ఇండియాలో విడుదలకు సిద్దమయ్యింది. ఈ అప్ కమింగ్ 5G స్మార్ట్ ఫోన్ ను ఏప్రిల్ 22న ఇండియాలో విడుదల చేస్తున్నట్లు శామ్సంగ్ ప్రకటించింది. శామ్సంగ్ గెలాక్సీ M53 ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తున్నట్లు కంపెనీ ఇప్పటికే వెల్లడించింది మరియు ఈ ఫోన్ యొక్క కొన్ని కీలకమైన ఫీచర్లను కూడా వెల్లడించింది. ఈ స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన సూపర్ AMOLED డిస్ప్లే, 108MP క్వాడ్ రియర్ కెమెరా సెటప్ వంటి ట్రెండీ ఫీచర్లతో ఈ ఫోన్ ను వస్తున్నట్లు శామ్సంగ్ పేర్కొంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung Galaxy M53 5G: స్పెక్స్

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి ఆన్లైన్ లో రివీల్ చేసిన స్పెక్స్ విషయానికి వస్తే, గెలాక్సీ ఎం53 5జి స్మార్ట్ ఫోన్ లో ఇన్ఫినిటీ-0 కటౌట్ కలిగిన 6.7- ఇంచ్ Super AMOELD డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే FHD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో ఎటువంటి ప్రాసెసర్ తో వస్తుందనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. కానీ, Dimensity 900 SoC కి జతగా 6GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుందని ఊహస్తున్నారు.

ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000 mAh భారీ బ్యాటరీని కలిగివుంటుంది. ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరాను ఇన్ఫినిటీ-0 కటౌట్ లో కలిగివుంటుంది. అలాగే, 108MP ప్రధాన సెన్సార్, 8MP అల్ట్రావైడ్, 2MP డెప్త్ సెన్సార్ మరియు 2MP మాక్రో సెన్సార్ కలిగిన క్వాడ్ రియర్ కెమెరా మాడ్యూల్‌ను వుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా One UI 4.1 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది.    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo