శామ్సంగ్ తన గెలాక్సీ M సిరిస్ నుండి మరొక అద్భుతమైన స్మార్ట్ ఫోన్ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. అదే ఈ Samsung Galaxy M 40 స్మార్ట్ ఫోన్. ఇప్పటి వరకు M సిరిస్ నుండి వచ్చిన స్మార్ట్ ఫోన్లు అన్ని కూడా మంచి విజయాన్ని సాధించాయి. కాబట్టి, శామ్సంగ్ ఈ స్మార్ట్ ఫోన్ను మరింత వైవిధ్యభరితంగా అందిస్తోంది. ఇందులో ముఖ్యంగా పంచ్ హోల్ డిస్ప్లే మరియు వెనుక అందించిన ట్రిపుల్ రియర్ కెమెరా ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి.
మొరొక ముఖ్యవిషయం ఏమిటంటే, ఇప్పటి వరకు తన M సిరిస్ ఫోన్లలో కేవలం తాన్ సొంత ప్రాసెసర్ మాత్రమే అందించిన శామ్సంగ్, ఇప్పుడు రూటుమార్చి స్నాప్ డ్రాగన్ ప్రాసెస్ ని ఇందులో అందించనున్నట్లు అమేజాన్ లో అందించిన టీజ్ ద్వారా తెలుస్తోంది. అమేజాన్ ఈ స్మార్ట్ ఫోన్ కోసం ప్రత్యేకంగా అందించిన ఒక పేజీలో దీని గురించి వివరించింది. ఇందులో స్నాప్ డ్రాగన్ 6 సిరిస్ ప్రాసెసర్ అందించనున్నట్లు చూపిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ను జూన్ 11 వ తేదీ సాయంత్రం 6 గంటలకి ఇండియాలో విడుదల చేయనునట్లు ఈ పేజీ ద్వారా టీజ్ చేస్తోంది. అంతేకాకుండా, దీనిలోని ఫీచర్ల గురించి ఊహించి అమెజాన్ ఇండియా యొక్క ఈ పేజీలో అందించిన వారికీ బహుమతులను అందించే, ఒక కాంటెస్ట్ కూడా నిర్వహిస్తోంది.
ఇక స్మార్ట్ ఫోన్ డిజైన్ విషయానికి వస్తే, ఇది ముందుభాగంలో ఒక పంచ్ హోల్ సెల్ఫీ కెమెరాతో పూతి డిస్ప్లేతో రానుంది. శామ్సంగ్, దీన్నిఇన్ఫినిటీ O డిస్ప్లే గా చెబుతోంది కంపెనీ. అలాగే, వెనుక ఒక ట్రిపుల్ రియర్ కెమేరా మరియు ఒక పెద్ద ప్రధాన కెమెరాని ఇందులో అందించనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఈ M సిరిస్ ఫోన్లన్నీకూడా వాటి ప్రత్యేకతల పరంగా చూస్తే, చాల తక్కువ ధరకే అందించినట్లు చెప్పొచ్చు. ఇదే విధంగా చుస్తే, ఈ కొత్త ఫోన్ను కూడా అలాంటి తక్కువ ధరకే తీసుకురావచ్చని అంచనావేయవచ్చు.