Samsung Galaxy M32 5G: ఆకట్టుకునే ఫీచర్లతో రేపు విడుదలకాబోతోంది

HIGHLIGHTS

రేపు విడుదలకానున్న Sasmung Galaxy M32 5G

48MP క్వాడ్ కెమెరా సెటప్

12 బ్యాండ్స్ వరకూ 5G సపోర్ట్ చేస్తుంది

Samsung Galaxy M32 5G: ఆకట్టుకునే ఫీచర్లతో రేపు విడుదలకాబోతోంది

Samsung గెలాక్సీ M సిరీస్ నుండి శాంసంగ్ గెలాక్సీ ఎం32 5జి స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయడానికి సన్నద్ధమయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఆగష్టు 25 న, అంటే రేవు ఇండియాలో లాంచ్ చేయబోతోంది. అమెజాన్ ఇండియా ఈ శాంసంగ్ గెలాక్సీ ఎం32 5జి కోసం ప్రత్యేకమైన మైక్రోసైట్ పేజ్ ను కూడా అందించింది. అమెజాన్ మైక్రో సైట్ పేజ్ ద్వారా ఈ అప్ కమింగ్ ఫోన్ యొక్క కొన్ని కీలకమైన ఫీచర్లనుకూడా వెల్లడించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung Galaxy M32 5G: స్పెసిఫికేషన్‌లు

స్పీడ్, గేమింగ్ మరియు మల్టీ టాస్కింగ్ కోసం ఈ శాంసంగ్ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 720 SoC ను ఉపయోగించినట్లు శాంసంగ్ టీజేచేస్తోంది. ఈ ప్రొసెసర్ గరిష్టంగా 2.2 Ghz స్పీడ్ కలిగిన ఆక్టా కోర్ SoC మరియు Arm Mali-G57 GPU తో జతగా ఉంటుంది. ఇది మంచి గేమింగ్ మరియు 12 బ్యాండ్స్ వరకూ 5G సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ 2 సంవత్సరాల వరకూ OS సపోర్ట్ తో వస్తుందని కూడా శాంసంగ్ టీజర్ నుండి వెల్లడించింది.

శాంసంగ్ గెలాక్సీ ఎం32 5జి స్మార్ట్ ఫోన్ వెనుక అందమైన డిజైన్ లో క్వాడ్ కెమెరా సెటప్ తో కనిపిస్తోంది. ఈ సెటప్ లో 48ఎంపి ప్రధాన కెమెరా ని అందించింది మరియు ఫ్లాష్ లైట్ ను కూడా కెమెరాతో జతగా ఇచ్చింది. ముందుభాగంలో, 13ఎంపి సెల్ఫీ కెమెరాని కూడా ఈ ఫోన్లో అందించింది. అలాగే, 6.49 ఇంచ్ ఇన్ఫినిటీ V-డిస్ప్లేతో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ పెద్ద 5,000mAh బ్యాటరీతో లాంచ్ కాబోతోంది.   

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile