Samsung Galaxy M17e 5G: శాంసంగ్ అప్ కమింగ్ 5జి ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసింది.!

HIGHLIGHTS

శాంసంగ్ అప్ కమింగ్ 5జి ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసింది

Samsung Galaxy M17e 5G మోడల్ లాంచ్ కోసం సిద్ధమయ్యింది

ఈ అప్ కమింగ్ ఫోన్ లీక్డ్ అండ్ అంచనా స్పెక్స్ కూడా ఆన్లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి

Samsung Galaxy M17e 5G: శాంసంగ్ అప్ కమింగ్ 5జి ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసింది.!

Samsung Galaxy M17e 5G: శాంసంగ్ అప్ కమింగ్ 5జి ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసింది. ఇటీవల బడ్జెట్ ధరలో గెలాక్సీ M17 ఫోన్ ను అందించిన శాంసంగ్, ఇప్పుడు ఈ ఫోన్ యొక్క మరింత చవక ధర మోడల్ లాంచ్ కోసం సిద్ధమయ్యింది. శాంసంగ్ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం అందించిన టీజర్ ఇమేజ్ ద్వారా కొన్ని కీలక వివరాలు కూడా వెల్లడించింది.అయితే అంతేకాదు, ఈ అప్ కమింగ్ ఫోన్ లీక్డ్ అండ్ అంచనా స్పెక్స్ కూడా ఆన్లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung Galaxy M17e 5G: లాంచ్ డేట్

శాంసంగ్ గెలాక్సీ M17e స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను కంపెనీ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ ఫోన్ ను త్వరలో ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు మాత్రమే అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా నుండి ప్రత్యేకంగా టీజింగ్ చేస్తోంది. ఎందుకంటే, ఈ ఫోన్ ను అమెజాన్ స్పెషల్ గా లాంచ్ చేస్తోంది.

Samsung Galaxy M17e 5G: ఫీచర్స్

శాంసంగ్ గెలాక్సీ M17e ఫీచర్స్ గురించి కంపెనీ ఇంకా ఎటువంటి వివరాలు అందించలేదు. అయితే, ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ డిజైన్ మాత్రం తెలిసేలా చేసింది. ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నట్లు క్లియర్ చేసింది. అంటే, శాంసంగ్ గెలాక్సీ M17 ఫోన్ తో పోలిస్తే ఈ ఫోన్ లో తక్కువ ఉంటుంది. ఎందుకంటే, శాంసంగ్ గెలాక్సీ M17 ఫోన్ ను ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టం తో అందించింది.

Samsung Galaxy M17e 5G

కానీ, ఈ ఫోన్ కూడా చూడటానికి గెలాక్సీ ఎం 17 ఫోన్ మాదిరిగా కనిపించే అదే డిజైన్ తో ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ వివరాలు మాత్రమే ఈ ఫోన్ గురించి కంపెనీ తెలిసేలా చేసింది.

Also Read: ZEBRONICS Dolby 5.1 సౌండ్ బార్ ఆల్ టైం చవక ధరలో లభిస్తోంది.. ఎక్కడంటే.!

శాంసంగ్ గెలాక్సీ M17e : అంచనా ఫీచర్స్

శాంసంగ్ గెలాక్సీ ఎం 17e స్మార్ట్ ఫోన్ మరింత బడ్జెట్ ఫోన్ గా వచ్చే అవకాశం ఉండొచ్చని లీక్స్ చెబుతున్నాయి. లీక్స్ ప్రకారం, ఈ ఫోన్ 6.7 అంగుళాల పెద్ద డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ బడ్జెట్ 5G చిప్ సెట్ Dimensity 6300 లాంచ్ కావచ్చని కూడా కొత్త లీక్స్ చెబుతున్నాయి. ఇది కాకుండా ఈ ఫోన్ లో 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ ఉంటుందని కూడా లీక్స్ చెబుతున్నాయి.

ఈ ఫోన్ 50MP ప్రధాన కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా సెటప్ కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 6000 mAh భారీ బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఇది బడ్జెట్ ఫోన్ అయినా కూడా లేటెస్ట్ One UI 8 ఆధారిత సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 16OS తో లాంచ్ అవుతుందని లీక్స్ చెబుతున్నాయి. మరి శాంసంగ్ ఈ ఫోన్ ను ఎటువంటి ఫీచర్స్ తో లాంచ్ చేస్తుందో చూడాలి.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo