శాంసంగ్ గెలాక్సీ F22 ను షాకింగ్ ప్రైస్ తో విడుదల చేసింది

శాంసంగ్ గెలాక్సీ F22 ను షాకింగ్ ప్రైస్ తో విడుదల చేసింది
HIGHLIGHTS

శాంసంగ్ తన గెలాక్సీ F22 షాకింగ్ ప్రైస్ తో విడుదల

గెలాక్సీ F22 మార్కెట్లో ఉన్న సరసమైన స్మార్ట్ ఫోన్లలో ఒకటి

ఈ ఫోన్ ను మరొకసారి భారీ 6,000mAh బ్యాటరీతో తీసుకొచ్చింది

శాంసంగ్ తన గెలాక్సీ F22 షాకింగ్ ప్రైస్ తో విడుదల చేసింది. శాంసంగ్ గెలాక్సీ F సిరీస్ నుండి చాలా తక్కువ ధరలో చాలా మంచి ఫీచర్లతో వచ్చింది. ఈ ఫోన్ ను మరొకసారి భారీ 6,000mAh బ్యాటరీతో తీసుకొచ్చింది. శాంసంగ్ గెలాక్సీ F22 ను రోజువారి అవసరాలకు తగిన విధంగా చాలా మంచి ఫీచర్లతో అందించింది. అంతేకాదు, అంతేకాదు, శాంసంగ్ గెలాక్సీ F22 ప్రస్తుత మార్కెట్లో ఉన్న సరసమైన స్మార్ట్ ఫోన్లలో ఒకటిగా నిలుస్తుంది.

SAMSUNG Galaxy F22: ప్రైస్

శాంసంగ్ గెలాక్సీ F22 స్టార్టింగ్ వేరియంట్ 4జీబీ ర్యామ్ మరియు 64జీబీ స్టోరేజ్ తో కేవలం రూ.12,499 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఇక మరొక వేరియంట్ 6జీబీ ర్యామ్ మరియు 128జీబీ స్టోరేజ్ తో కేవలం రూ.14,499 రూపాయల ధరతో అందించింది.                             

SAMSUNG Galaxy F22: ఫీచర్లు

శాంసంగ్ గెలాక్సీ F22 స్మార్ట్ ఫోన్ ఒక 6.4 ఇంచ్ HD + Super AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది.  ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో G80 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పనిచేస్తుంది మరియు దీనికి జతగా 6జీబీ ర్యామ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ OneUI Core 3.1 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 11 OS తో పనిచేస్తుంది.

ఈ ఫోన్ వెనుక క్వాడ్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో, ప్రధాన కెమెరాగా 48MP సెన్సార్ ని అందించింది. దీనికి జతగా, 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ సెనర్, 2MP  డెప్త్ మరియు 2MP మ్యాక్స్రో సెనర్లను కూడా ఇచ్చింది. ముందు భాగంలో 13MP సెల్ఫీ కెమెరా ని కూడా పొందుతారు.

ఈ ఫోన్ లో 15W ఛార్జింగ్ సపోర్ట్ గల అతిపెద్ద 6,000 mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫేస్ అన్లాక్ సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ యొక్క మొదటి సేల్ జూలై 13 న మధ్యాహ్నం 12 గంటలకి Flipkart మరియు శాంసంగ్ వెబ్సైట్ నుండి జరుగుతుంది. అంతేకాదు, పరిచయ అఫర్ క్రింద 1,000 రూపాయల తక్కువ ధరకు అఫర్ చేస్తోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo