భారీ కెమేరా సెట్టింగ్ తో విడుదలైన శామ్సంగ్ గెలాక్సీ F54 స్మార్ట్ ఫోన్..!

HIGHLIGHTS

శామ్సంగ్ గెలాక్సీ F54 ఎట్టకేలకు లాంచ్ చేసింది

శామ్సంగ్ గెలాక్సీ F54 భారీ కెమేరా సెట్టింగ్ తో వచ్చింది

శామ్సంగ్ గెలాక్సీ F54 స్మార్ట్ ఫోన్ మిడ్ ధరలో లాంచ్ చెయ్యబడింది

భారీ కెమేరా సెట్టింగ్ తో విడుదలైన శామ్సంగ్ గెలాక్సీ F54 స్మార్ట్ ఫోన్..!

ఈరోజు శామ్సంగ్ ఇండియాలో తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ శామ్సంగ్ గెలాక్సీ F54 ఎట్టకేలకు లాంచ్ చేసింది. శామ్సంగ్ గెలాక్సీ F54 స్మార్ట్ ఫోన్ ను భారీ కెమేరా సెట్టింగ్ తో పాటుగా మరిన్ని ఫీచర్లతో భారతీయ మార్కెట్ లో ఈరోజు ప్రవేశపెట్టింది. ఈ శామ్సంగ్ గెలాక్సీ F54 స్మార్ట్ ఫోన్ మిడ్ ధరలో లాంచ్ చెయ్యబడింది. ఈరోజే విడుదలైన ఈ శామ్సంగ్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్ల పైన ఒక లుక్కేద్దామా. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

శామ్సంగ్ గెలాక్సీ F54: ధర 

శామ్సంగ్ గెలాక్సీ F54 స్మార్ట్ ఫోన్ 8GB ర్యామ్ మరియు 256 GB స్టోరేజ్ తో రూ. 29,999 రూపాయల ధరలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ప్రీ ఆర్డర్స్  ఈరోజు మొదలు పెట్టింది శామ్సంగ్. ఈ ఫోన్ ఈరోజు నుండి Flipkart మరియు శామ్సంగ్ ఆన్లైన్ స్టోర్ నుండి ప్రీ ఆర్డర్స్ కి అందుబాటులోకి వుంది

ఈ స్మార్ట్ ఫోన్ పైన గొప్ప ఆఫర్లను కూడా శామ్సంగ్ అందించింది. HDFC బ్యాంక్ క్రెడిట్ / డెబిట్ కార్డ్ తో శామ్సంగ్ గెలాక్సీ F54 కొనేవారు రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ ను పొందుతారు. 

శామ్సంగ్ గెలాక్సీ F54: ఫీచర్లు 

శామ్సంగ్ గెలాక్సీ F54 స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.7 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లేని కలిగి వుంది. ఈ స్మార్ట్ ఫోన్ శామ్సంగ్ యొక్క సొంత ప్రోసెసర్ Exynos 1380 SoC కి జతగా 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. శామ్సంగ్ గెలాక్సీ F54 25W ఫాస్ట్ కేహార్జ్ సపోర్ట్ కలిగిన 6000mAh హెవీ బ్యాటరీని కూడా కలిగి వుంది. 

ఇక శామ్సంగ్ గెలాక్సీ F54 కెమేరా వివరాలలోకి వెళితే, ఈ ఫోన్ వెనుక 108MP మెయిన్ కెమేరా జతగా 8MP అల్ట్రా వైడ్ మరియు 2MP డెప్త్ కెమెరాలను కలిగి వుంది. అలాగే, ముందు 32MP సెల్ఫీ కెమేరాని కూడా ఈ ఫోన్ లో అందుకుంది. ఈ ఫోన్ కెమేరాతో 4K వీడియోలను 30fps వద్ద చిత్రీకరించవచ్చని కంపెనీ తెలిపింది మరియు నో షేక్ మోడ్ ఫీచర్ కూడా ఇందులో వుంది. 

శామ్సంగ్ గెలాక్సీ F54 ఆండ్రాయిడ్ 13 OS పైన OneUI సాఫ్ట్ వేర్ పైన పని చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo