HIGHLIGHTS
Samsung Galaxy F06 5G స్మార్ట్ ఫోన్ రేపు ఇండియాలో లాంచ్ అవుతుంది
కొత్త డిజైన్ తో లాంచ్ అవుతున్న శామ్సంగ్ గెలాక్సీ F06 5జి
ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు విడుదలవుతుంది
Samsung Galaxy F06 5G స్మార్ట్ ఫోన్ రేపు ఇండియాలో లాంచ్ అవుతుంది. అయితే, రేపు విడుదల కాబోతున్న ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ ను మనం ఈ రోజే చూడనున్నాము. శామ్సంగ్ ఈ కొత్త ఫోన్ ను ఆకట్టుకునే సరికొత్త డిజైన్, కెమెరా సెటప్ మరియు సరికొత్త కలర్ ఆప్షన్లలో లాంచ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ ఫోన్ ఫీచర్స్ మరియు రేటు తెలుసుకోండి.
Surveyశామ్సంగ్ గెలాక్సీ F06 5జి స్మార్ట్ ఫోన్ ను అన్ని ఆఫర్స్ తో కలిపి రూ. 9,XXX ఆఫర్ ప్రైస్ ట్యాగ్ చేస్తున్నట్లు శామ్సంగ్ అనౌన్స్ చేసింది. ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు విడుదలవుతుంది.
శామ్సంగ్ గెలాక్సీ F06 5జి ఫోన్ 6.7 ఇంచ్ IPS స్క్రీన్ ను HD+ రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు తక్కువ అంచులు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ బడ్జెట్ 5జి చిప్ సెట్ Dimensity 6300 తో వస్తుంది. ఈ ఫోన్ లో 6GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ శామ్సంగ్ కొత్త ఫోన్ 50MP మెయిన్ కెమెరా మరియు 2MP డెప్త్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ మరియు 8MP సెల్ఫీ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 25W ఫాస్ట్ చార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ కూడా ఉంటుంది. ఈ ఫోన్ ను 4 OS అప్గ్రేడ్స్ మరియు 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ తో కూడా అందిస్తుంది.
Also Read: గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ తో 5 వేలకే లభిస్తున్న లేటెస్ట్ 8GB ర్యామ్ Smartphone
ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ బహామా బ్లూ మరియు లిట్ వయోలెట్ రెండు రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్ కెమెరా సెటప్ ను మరియు ఫోన్ డిజైన్ డిజైన్ ను కూడా సరికొత్తగా అందించింది.