సామ్సంగ్ గెలాక్సీ కోర్ ప్రైమ్ 4జి లాంచ్

సామ్సంగ్ గెలాక్సీ కోర్ ప్రైమ్ 4జి లాంచ్
HIGHLIGHTS

డ్యూయల్ సిమ్, 4జి దీని ప్రత్యేకత

రూ. 9,999 కు సామ్సంగ్ అఫీషియల్ వెబ్ సైటు లో దాని కొత్త మోడల్ కోర్ ప్రైమ్ 4G ను కొనేందుకు ఆప్షన్ ఇస్తుంది. ఈ మొబైల్ రీసెంట్ గా ధర్డ్ పార్టీ ఈ కామర్స్ సైట్ లో 9,750 రూ. లకు సేల్ అయ్యింది.

సామ్సంగ్ కోర్ ప్రైమ్ 4G స్పెసిఫికేషన్స్- 4.5 in WVGA డిస్ప్లే, ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ 4.4, 1.2GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1 జిబి ర్యామ్, 5MP బ్యాక్ మరియు 2MP ఫ్రంట్ కెమేరా, 8జిబి ఇంటర్నెల్, 64 జిబి అదనపు స్టోరేజ్ సదుపాయం. కనెక్టివిటి విషయానికి వస్తే 4G, డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 4.0, మైక్రో usb, వైఫై, GPS, 2,000 mah బ్యాటరీ ఉన్నాయి.

ఇక్కడ సామ్సంగ్ కోర్ ప్రైమ్ పూర్తి స్పెసిఫికేషన్స్ ను చూడండి

దీనికి ముందు కోర్ ప్రైమ్ 3జి ఫోన్ ఒకటి గత సంవత్సరం లాంచ్ అయ్యింది. దీని స్పెక్స్- 4.5 in IPS LCD WVGA డిస్ప్లే, ఆండ్రాయిడ్ కిట్క్యాట్, 1.3 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జిబి ర్యామ్, 5 MP మరియు 2MP కెమేరాలు. 8జిబి ఇంబిల్ట్ స్టోరేజ్, 2,000 mah బ్యాటరీ. అన్ని సేమ్ ఫీచర్స్ కేవలం 4జి మాత్రమే తేడా. కొత్త కోర్ ప్రైమ్ 4జి మోడల్ దాని బడ్జెట్ ధర వలన మిగిలిన 4జి డివైజ్ లకు (రెడ్మీ నోట్ 4G, యురేకా, లుమియా 638, లెనోవో A7000) పోటీ గా ఉండే అవకాశాలు ఉన్నాయి.

10,000రూ. బడ్జెట్ లోపు స్మార్ట్ ఫోన్స్ ను ఇక్కడ చూడండి.

Kul Bhushan
Digit.in
Logo
Digit.in
Logo