శామ్సంగ్ గెలాక్సీ A80 కెమేరా రూటే వేరు

శామ్సంగ్ గెలాక్సీ A80 కెమేరా రూటే వేరు

శామ్సంగ్ కొత్తగా తీసుకొచ్చిన ఈ గెలాక్సీ A80 స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఇప్పటివరకు చూడనటువంటి ఒక విలక్షణమైన కెమేరాతో వస్తుంది. అదేమిటంటే, ముందుకు మరియు వేనుకకు కూడా రోటేట్  (తిప్పగలిగే) చేయగలిగేలా వుండే ఒక ట్రిపుల్ కెమేరా సేటప్పుతో ఈ ఫోన్నుతీసుకువచ్చింది. అంతేకాదు, ఇందులో అందించిన ప్రధాన కెమేరా ఒక 48MP సెన్సార్ తో వస్తుంది. అంటే, ఈ కెమేరాతో బెస్ట్ ఫోటోలను తీసుకోవడమేకాకుండా సూపర్ క్లారిటీతో సెల్ఫీలను కూడా తీసుకోవచ్చాన్నమాట.

ఈ ప్రధాన కెమేరా కూడా SonyIMX586 సెన్సార్ ని అందించినట్లు తెలుస్తోంది. కేవలం ఇది ఒక్కటే ప్రత్యేకత కాదు, ఇందులో సరికొత్త స్నాప్ డ్రాగన్ 730G  ఆక్టా కోర్ ప్రాసెసర్ కూడా అందించింది. ఈ ప్రాసెసర్ కెమేరాల కోసం ప్రత్యేకంగా అందిచబడింది, దీనితో పోర్ట్రైట్ మోడులో కూడా 4K HDR వీడియోలను కూడా తీసుకోవచ్చని క్వాల్కమ్ ప్రకటించింది. అలాగే, ఈ ప్రాసెసర్ లో పెంపొందించిన AI ప్రభావంతో కెమేరా, గేమింగ్ మరియు సెక్యూరిటీ వంటి వాటిపైన గొప్ప పట్టు ఉంటుందని కూడా క్వాల్కమ్ ముందుగానే పేర్కొంది.                     

శామ్సంగ్ గెలాక్సీ A80 ప్రత్యేకతలు

శామ్సంగ్ గెలాక్సీ A80 స్మార్ట్ ఫోన్  20: 9 యాస్పెక్ట్ రేషియో డిస్ప్లేలో, ఎటువంటి నోచ్ లేకుండా ఫుల్ వ్యూ డిస్ప్లే మరియు దాదాపుగా అంచులు లేకుండా, FHD+ రిజల్యూషన్ అందించగల ఒక 6.7 అంగుళాల సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది 1080×2400 p రిజల్యూషను మరియు వీనుల విందైన VIVID మరియు బ్రిట్నెస్ అందిస్తుంది. ఇది తాజాగా క్వాల్కమ్ ప్రకటించినటువంటి, క్వాల్కమ్ యొక్క స్నాప్ డ్రాగన్ 730G  SoC తో నడుస్తుంది. ఇది 8GB ర్యామ్ మరియు 128GB అంతర్గత స్టోరేజితో వస్తుంది. అయితే, ఇందులో స్టోరేజిని పెంచుకునేలా ఎటువంటి ఎంపికను అందించలేదు. అలాగే, ఇది ఒక 3,700        

ఆప్టిక్స్ పరంగా, ఈ స్మార్ట్ ఫోన్ ఒక ప్రధాన 48MP కెమెరా f / 2.0 ఎపర్చరు జతగా 123 డిగ్రీల ఫీల్డ్ వ్యూ గల ఒక వైడ్ యాంగిల్ కెమేరా మరియు ఒక ToF కెమేరాని కలగలిపిన ఒక ట్రిపుల్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఇక్కడ ఆశర్యపరిచే విష్యం ఏమిటంటే, ఈ కెమేరాని ముందు భాగంలో సెల్ఫీగా మరియు వెనుక కెమెరాలగా కూడా వాడుకునేలా రోటేటింగ్ ఎంపికతో అందించింది. రివ్యూ యూనిట్లో మాత్రం SonyIMX586 సెన్సారుతో అందించింది. అయితే, ఫోన్ అమ్మకానికి వచ్చే సమయానికి తన సొంత సెన్సారును తీసుకువస్తుందో లేదో అనే విష్యం పైన ఎటువంటి సమాచారం లేదు. ఇక ఈ 48MP కెమేరా విషయానికి వస్తే, ఇది డిఫాల్ట్ గా రెడ్మి  నోట్ 7 ప్రో మాదిరిగా బిన్నింగ్ పద్దతిలో 12MP రిజల్యూషన్ ఫోటోలను అందిస్తుంది. అయితే, ఈ ఫోనులో అందించిన ఒక ప్రో మోడ్ ద్వారా చాలా వేగంగా 48MP రిజల్యూషన్ ఫోటోలకు మారవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo