రెడ్మి K20 vs శామ్సంగ్ గెలాక్సీ A51

రెడ్మి K20 vs శామ్సంగ్ గెలాక్సీ A51
HIGHLIGHTS

ఏది మంచి ఎంపికగా ఉంటుందో తెలుసుకుందాం.

ప్రస్తుతం, ఇండియాలో మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో గట్టి పోటీ నడుస్తునట్లు కనిపిస్తోంది. ఇప్పటేకే, చాలా ఫోన్లు మిడ్ రేంజ్ సెగ్మెంట్లో పోటీని ఎదుర్కొటుంటే, శామ్సంగ్ కొత్తగా లాంచ్ చేసిన గెలాక్సీ A51 కూడా వాటికీ మరొక గట్టి పోటీగా మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్ 48MP క్వాడ్ కెమేరా, స్పీడ్ ప్రాసెసర్ మరియు మంచి డిజనుతో లాంచ్ చెయ్యబడింది. కాబట్టి, ఈరోజు మనం మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో ఇప్పటికే వున్నా షావోమి రెడ్మి K 20 స్మార్ట్ ఫోనుతో ఈ శామ్సంగ్ గెలాక్సీ A51 స్మార్ట్ ఫోన్ను సరిపోల్చి ఏది మంచి ఎంపికగా ఉంటుందో తెలుసుకుందాం.

Price 

శామ్సంగ్ గెలాక్సీ A51 :  ధరలు

1. శామ్సంగ్ గెలాక్సీ A51  (6GB + 128GB) ధర – Rs.23,999

రెడ్మి K20:  ధరలు

1. రెడ్మి K20  (6GB + 64GB) ధర – Rs.19,999

2. రెడ్మి K20  (6GB + 128GB) ధర – Rs.22,999

డిస్ప్లే :

డిస్ప్లే విభాగంలో, ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా AMOLED డిస్ప్లేతో వస్తాయి. A51 6.5 అంగుళాలు పరిమాణం కలిగివుంటుంది. అలాగే, ఈ డిస్ప్లే ఒక 2340×1080 పిక్సెల్స్ రిజల్యూషన్, అంటే FHD+  అందించగల ఒక Super AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇక రెడ్మి K20 విషేబునికి వస్తే, ఒక 6.39 అంగుళాల పరిమాణం గల హారిజన్ AMOLED డిస్ప్లేతో FHD+ రిజల్యూషన్ తో వస్తుంది.       

ప్రాసెసర్ :

ఈ రెండు స్మార్ట్ ఫోన్ల మధ్యగల ముఖ్యమైన వ్యత్యాసంగా, ఈ రెండింటి ప్రాసెసర్ల గురించి చెప్పొచ్చు. శామ్సంగ్ గెలాక్సీ A51 ఒక 2.3 GHz వరకూ క్లాక్ స్పీడ్ అందించగల Exynos 9611 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో వస్తుంది. ఇక K20 విషయానికి వస్తే, ఇది 2.2 GHz వరకూ క్లాక్ స్పీడ్ అందించగల స్నాప్ డ్రాగన్ 730 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో వస్తుంది. అయితే, శామ్సంగ్ గెలాక్సీ A51 ప్రాసెసర్ ఒక 10nm ఫ్యాబ్రికేషన్ తో వస్తే, రెడ్మి K20 ఒక 8nm ఫ్యాబ్రికేషన్ ప్రాసెసర్ తో వస్తుంది.

వెనుక కెమేరా :

ఇక ఈ విభాగంలో కూడా ఈ రెండు స్మార్ట్ ఫోన్లు ఒకేవిధమైన కెమేరా ప్రత్యేకతలను మరియు సెన్సర్లను కలిగి ఉంటాయి. రియల్మి XT మరియు రియల్మీ X2 వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ తో ఉంటుంది. ఇది f / 2.25 ఎపర్చరు లెన్స్ మరియు 119 డిగ్రీల ఫీల్డ్ వ్యూతో ఒక 8MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ కలిగి ఉంటుంది. దీనికి జతగా 64MP ప్రాధమిక సెన్సార్‌తో పాటు, F / 2.4 లెన్స్‌తో 2MP పోర్ట్రెయిట్ లెన్స్ మరియు f / 2.4 మాక్రో లెన్స్‌తో 2MP కెమెరా కూడా ఉన్నాయి.

సెల్ఫీ కెమెరా :

ఈ విభాగంలో, ఈ  రెండింటి మధ్య చాలా వ్యత్యాసం వుంది. శామ్సంగ్ గెలాక్సీ A51 ముందుభాగంలో ఒక 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అయితే, రెడ్మి K20  మాత్రం ఒక 20MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అయితే, శామ్సంగ్ గెలాక్సీ A51 ఒక ఇన్ఫినిటీ -O సెల్ఫీ కెమేరా డిజనుతో వస్తుండగా, రెడ్మి K20 పాపా అప్ సెల్ఫీ డిజైనుతో వస్తుంది.     

 బ్యాటరీ :

శామ్సంగ్ గెలాక్సీ A51 ఒక 4000mAh బ్యాటరీ మరియు 15W ఫాస్ట్ ఛార్జింగ్ యొక్క మద్దతు ఇస్తుంది. ఇక రెడ్మి K20 విషయానికి వస్తే, ఇది ఒక 4000mAh బ్యాటరీతో టైప్-సి పోర్ట్‌ను కలిగి ఉంది మరియు 18 వాట్స్  క్విక్ ఛార్జ్ 3.0 ఛార్జింగ్‌ కు మద్దతు ఇస్తుంది.

OS & సెక్యూరిటీ:

శామ్సంగ్ గెలాక్సీ A51 తన సొంత One UI స్కిన్ పైన ఆండ్రాయిడ్ 9 ఫై ఆధారితంగా పనిచేస్తుంది. ఇక రెడ్మి K20 విషయానికి వస్తే, ఇది MIUI 10 స్కిన్ పైన    ఆండ్రాయిడ్ 9 ఫై తో నడుస్తాయి. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo