Samsung Galaxy A03: మార్కెట్లోని బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లకు సరైన ప్రత్యర్థిగా వచ్చిందా..!

HIGHLIGHTS

సాంసంగ్ గెలాక్సీ ఎ03 ని ఆకట్టుకునే ఫీచర్లతో ఆవిష్కరించింది

ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది

6.5 ఇంచ్ HD+ డిస్ప్లేని ఇన్ఫినిటీ-V డిజైన్ తో కలిగి ఉంటుంది

Samsung Galaxy A03: మార్కెట్లోని బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లకు సరైన ప్రత్యర్థిగా వచ్చిందా..!

ఇండియాలో బడ్జెట్ సెగ్మెంట్ లో స్మార్ట్ ఫోన్ పరిధి పెరిగిపోనుంది. అందుకే, అన్ని మొబైల్ తయారీ కంపెనీలు కూడా తమ బడ్జెట్ సెగ్మెంట్ ను మరింత పటిష్టంగా ఉంచడానికి ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెడుతూనే ఉన్నాయి. Samsung తన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను చాలా ఆకట్టుకునే ఫీచర్లతో లాంచ్ చేసి ఈ మాటను నిరూపించింది. ఈరోజు సాంసంగ్ గెలాక్సీ ఎ03 ని ఆకట్టుకునే ఫీచర్లతో ఆవిష్కరించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung Galaxy A03: స్పెక్స్

సాంసంగ్ గెలాక్సీ ఎ03 ఫోన్ 6.5 ఇంచ్ HD+ డిస్ప్లేని ఇన్ఫినిటీ-V డిజైన్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ప్రోసెసర్ పేరును గురించి వెల్లడించలేదు. కానీ, ఇది (2×1.6GHz + 6×1.6GHz) క్లాక్స్ కలిగిన ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పనిచేస్తుంది. దీనికి జతగా 3GB/4GB ర్యామ్ మరియు 32GB/64GB/128GB స్టోరేజ్ వంటి అప్షన్ లతో లభిస్తుంది. ఈ ఫోన్ ను నలుపు, నీలం మరియు ఎరుపు వంటి మూడు రంగులలో ఎంచుకోవచ్చు.    

ఇక కెమెరా మరియు ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 48MP ప్రధాన కెమెరా  మరియు 2ఎంపి డెప్త్ సెన్సార్ జతగా ఉంటుంది. ఇక సెల్ఫీల కోసం ముందుభాగంలో 5ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది.

సాంసంగ్ ఈ Galaxy A03స్మార్ట్ ఫోన్ అధికారికంగా ఆవిష్కరించినా, ఈ ఫోన్ ప్రైస్ లేదా ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందనే విషయాలను మాత్రం ఇంకా ప్రకటించ లేదు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo