Samsung Galaxy M36 5G ఇండియా లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసిన శామ్సంగ్.!
Samsung Galaxy M36 5G లాంచ్ డేట్ ఈరోజు శామ్సంగ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది
ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ కీలక ఫీచర్స్ తెలియ చేసే టీజర్ ఇమేజ్ అందించింది
ఈ ఫోన్ కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్స్ కూడా అందించింది
Samsung Galaxy M36 5G ఇండియా లాంచ్ డేట్ ఈరోజు శామ్సంగ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను ఇదే నెలలో లాంచ్ చేసే అవకాశం ఉందని అందించిన అంచనాలను నిజం చేస్తూ శామ్సంగ్ ఈ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ కీలక ఫీచర్స్ తెలియ చేసే టీజర్ ఇమేజ్ మరియు మరిన్ని వివరాలు అందించింది.
Samsung Galaxy M36 5G: లాంచ్ డేట్
శామ్సంగ్ గెలాక్సీ ఎం 36 5జి స్మార్ట్ ఫోన్ ను వచ్చే శుక్రవారం జూన్ 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేస్తున్నట్లు శామ్సంగ్ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ స్పెషల్ గా లాంచ్ చేస్తోంది మరియు ఈ ఫోన్ ను అమెజాన్ ప్రత్యేకంగా టీజింగ్ చేస్తోంది. ఈ అమెజాన్ టీజర్ పేజీ నుంచి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క టీజర్ ఇమేజ్ మరియు కీలక స్పెక్స్ కూడా వెల్లడించింది.
Also Read: Realme P3 Pro 5G ఈరోజు మంచి డిస్కౌంట్ తో తక్కువ ధరలో లభిస్తుంది.!
Samsung Galaxy M36 5G: ఫీచర్స్
శామ్సంగ్ గెలాక్సీ ఎం 36 5జి స్మార్ట్ ఫోన్ ను కేవలం 7.7mm సూపర్ స్లిమ్ మరియు లైట్ వెయిట్ డిజైన్ తో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ లో స్క్రీన్ కోసం రక్షణగా అత్యంత కఠినమైన గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ని కూడా అందిస్తుంది. ఈ ఫోన్ కెమెరా గురించి శామ్సంగ్ ప్రత్యేకంగా చెబుతోంది. ఈ ఫోన్ లో 50MP OIS మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ మరియు 2MP మ్యాక్రో సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ ముందు భాగంలో 13MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ స్టేబుల్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో ఉంటుంది.
ఇక కెమెరా ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో అందించిన కెమెరాతో AI కెమెరా ఫీచర్స్ కూడా అందించింది. ఇందులో AI డెప్త్ మ్యాప్, AI సర్కిల్ మరియు మరిన్ని AI ఫీచర్స్ ఉంటాయి. ఇవి మాత్రమే కాదు ఆబ్జెక్ట్ ఎరేజర్, ఇమేజ్ క్లిప్పర్ మరియు ఎడిట్ సజెషన్స్ వంటి మరిన్ని ఫీచర్స్ కూడా ఈ ఫోన్ కలిగి ఉంటుందని కంపెనీ చెబుతోంది. శామ్సంగ్ గెలాక్సీ ఎం 36 5జి స్మార్ట్ ఫోన్ ఆరెంజ్ హేజ్, సెరీన్ గ్రీన్ మరియు వెల్వెట్ బ్లాక్ మూడు కలర్ అప్షన్స్ లో లాంచ్ అవుతుంది.