Realme P3 Pro 5G ఈరోజు మంచి డిస్కౌంట్ తో తక్కువ ధరలో లభిస్తుంది.!

HIGHLIGHTS

Realme P3 Pro 5G మంచి డిస్కౌంట్ తో తక్కువ ధరలో లభిస్తుంది

ఈ స్మార్ట్ ఫోన్ ను రియల్ మీ ఇటీవలే ఇండియాలో విడుదల చేసింది

ఈ ఫోన్ ఈరోజు 20 వేల రూపాయల కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంది

Realme P3 Pro 5G ఈరోజు మంచి డిస్కౌంట్ తో తక్కువ ధరలో లభిస్తుంది.!

Realme P3 Pro 5G స్మార్ట్ ఫోన్ ఇండియాలో రీసెంట్ గా విడుదలైన స్మార్ట్ ఫోన్ మరియు ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్ మంచి డిస్కౌంట్ తో తక్కువ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను రియల్ మీ ఇటీవలే ఇండియాలో విడుదల చేసింది మరియు ఈ ఫోన్ గొప్ప డిజైన్, స్నాప్ డ్రాగన్ చిప్ సెట్ మరియు కర్వుడ్ స్క్రీన్ వంటి ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ ఈరోజు 20 వేల రూపాయల కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme P3 Pro 5G : ఆఫర్ ప్రైస్

రియల్ మీ పి 3 ప్రో స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 23,999 రూపాయల ద్గరతో లాంచ్ అయ్యింది. అయితే, ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 4,000 రూపాయల భారీ డిస్కౌంట్ అందుకుని ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు కేవలం రూ. 19,999 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తోంది. వాస్తవానికి, నిన్న కూడా ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ రూ. 22,999 రూపాయల ధరకు సేల్ అయ్యింది. కానీ ఈరోజు ఉదయం నుంచి ఈ ఫోన్ ఈ ఆఫర్ ప్రైస్ తో సేల్ అవుతోంది.

Realme P3 Pro 5G

కేవలం బేసిక్ వేరియంట్ ,మాత్రమే కాదు ఈ ఫోన్ 8 GB + 256 GB వేరియంట్ మరియు కూడా నాలుగు వేల రూపాయల డిస్కౌంట్ ఆఫర్ తో రూ. 20,999 మరియు రూ. 22,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తున్నాయి. ఈ ఫోన్ ను Flipkart Axis Bank క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లకు 5% అదనపు క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. అంటే, వెయ్యి రూపాయల వరకు క్యాష్ బ్యాక్ అందుకునే అవకాశం ఉంది.

Realme P3 Pro 5G : ఫీచర్స్

మిడ్ రేంజ్ గేమింగ్ మరియు మల్టీ టాస్కింగ్ యూజర్లను టార్గెట్ చేస్తూ రియల్ మీ ఈ ఫోన్ ను రీసెంట్ గా లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో గేమింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ కోసం అనువైన 6.83 ఇంచ్ క్వాడ్ కర్వుడ్ AMOLED స్క్రీన్ అందించింది. ఈ స్క్రీన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 120 Hz రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్ సపోర్ట్ మరియు 1500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ Snapdragon 7s Gen 3 5G చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు దీనికి జతగా 8GB / 12GB ర్యామ్ సపోర్ట్ అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ లో 128GB మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ 50MP Sony IMX 896 మెయిన్ సెన్సార్ మరియు 2MP రెండవ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ లో 16MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 30fps తో 4K వీడియో రికార్డింగ్ సత్తా మరియు AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Also Read: బడ్జెట్ ధరలో Dolby Atmos సౌండ్ బార్ లాంచ్ చేసిన boAt : ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!

ఈ ఫోన్ లో గేమింగ్ కోసం అవసరమైన గొప్ప బ్యాటరీ మరియు ఛార్జ్ సపోర్ట్ కూడా అందించింది. ఈ ఫోన్ లో 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు 80W అల్ట్రా ఛార్జ్ సపోర్ట్ అందించింది. ఈ ఫోన్ IP66, 68, 69 రేటింగ్ తో గొప్ప వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్ గా ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo