బడ్జెట్ ధరలో Dolby Atmos సౌండ్ బార్ లాంచ్ చేసిన boAt : ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!
boAt ఈరోజు బడ్జెట్ ధరలో Dolby Atmos సౌండ్ బార్ విడుదల చేసింది
ఈ కొత్త సౌండ్ బార్ ను Aavante Prime 5.1 5000DA పేరుతో లాంచ్ చేసింది
ఈరోజు నుంచి ఈ సౌండ్ బార్ ని సేల్ కి కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది
ప్రముఖ భారతీయ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ boAt ఈరోజు బడ్జెట్ ధరలో Dolby Atmos సౌండ్ బార్ ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త సౌండ్ బార్ ను Aavante Prime 5.1 5000DA పేరుతో లాంచ్ చేసింది మరియు ఈరోజు నుంచి ఈ సౌండ్ బార్ ని సేల్ కి కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ లేటెస్ట్ సౌండ్ బార్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.
SurveyboAt Dolby Atmos సౌండ్ బార్ : ప్రైస్
బోట్ అవాంటే ప్రైమ్ 5.1 5000 DA సౌండ్ బార్ ను రూ. 14,999 రూపాయల ఆఫర్ ధరతో లాంచ్ చేసింది. ఈ సౌండ్ బార్ పై రూ. 1,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ సౌండ్ బార్ ని అమెజాన్ నుంచి Axis మరియు SBI క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి ఈ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ను బోట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి బోట్ పే లేటర్ ఆప్షన్ తో వడ్డీ లేకుండా EMI ఆప్షన్ ద్వారా కొనుగోలు చేసే అవకాశం అందించింది. Buy From Here
Also Read: Samsung 4K Smart Tv పై జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన అమెజాన్.!
boAt Aavante Prime 5.1 5000DA : ఫీచర్లు
బోట్ సరికొత్తగా లాంచ్ చేసిన ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ లో మొత్తం ఆరు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు 6.5 ఇంచ్ ఉఫర్ స్పీకర్ కలిగిన సబ్ ఉఫర్ ఉంటాయి. బోట్ కొత్తగా లాంచ్ చేసిన ఈ సౌండ్ బార్ టోటల్ 500W సౌండ్ అవుట్ పుట్ కెపాసిటీ తో వస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ ను ఇంటికి సరిపోయే ప్రీమియం డిజైన్ తో కూడా అందించింది.

ఇక ఈ సౌండ్ బార్ కలిగిన సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ బోట్ సౌండ్ డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ HDMI(e-ARC), AUX, బ్లూటూత్ వెర్షన్ 5.3, USB మరియు ఆప్టికల్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ పూర్తిగా వైర్ కనెక్టివిటీ తో వస్తుంది. సౌండ్ బార్ తో వచ్చే బాక్స్ లో వాల్ మౌంట్ కిట్, రిమోట్, పవర్ కేబుల్, Aux ఇన్ కేబుల్ AAA బ్యాటరీ లను అందిస్తుంది.