శామ్సంగ్ గెలాక్సీ S 20 సిరీస్ ఫోన్లు ప్రకటన : స్నాప్ డ్రాగన్ 865,108 కెమేరా, 8K వీడియో వంటి భారీ ఫీచర్లు..

శామ్సంగ్ గెలాక్సీ S 20 సిరీస్ ఫోన్లు ప్రకటన : స్నాప్ డ్రాగన్ 865,108 కెమేరా, 8K వీడియో వంటి భారీ ఫీచర్లు..
HIGHLIGHTS

ఈ హ్యాండ్‌సెట్‌లు 4 జి మరియు 5 జి వేరియంట్‌లలో వస్తాయి.

గెలాక్సీ ఎస్ 20 సిరీస్‌ ను ప్రకటించాడనికి, Unpacked 2020 కార్యక్రమాన్ని వేదికగా తీసుకుంది. తన తాజా ఫ్లాగ్‌ షిప్ లైనప్‌లో గెలాక్సీ S 20, గెలాక్సీ 20+ మరియు గెలాక్సీ S 20 అల్ట్రా అనే మూడు మోడళ్లను ప్రకటించింది. ఈ హ్యాండ్‌సెట్‌లు 4 జి మరియు 5 జి వేరియంట్‌లలో వస్తాయి. ఈ మూడు ఫోన్లలో కొత్త 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లేలు మరియు 8K  వీడియో రికార్డింగ్ ఉన్నాయి. ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్లతో పాటుగా, కంపెనీ తన క్లామ్‌షెల్ ఫోల్డబుల్ ఫోన్‌ ను కూడా ప్రారంభించింది అదే – గెలాక్సీ జెడ్ ఫ్లిప్. అలాగే, గెలాక్సీ బడ్స్ + ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ ను కూడా ప్రకటించింది. 

శామ్సంగ్ గెలాక్సీ S20, గెలాక్సీ S 20 + స్పెసిఫికేషన్లు

ఎంట్రీ లెవల్ గెలాక్సీ S 20 లో ఒక 6.2-అంగుళాల డైనమిక్ అమోలెడ్ 2 ఎక్స్ డిస్ప్లే ఉంది. ఇక గెలాక్సీ S 20 + ఒక 6.7-అంగుళాల డైనమిక్ అమోలెడ్ 2 ఎక్స్ డిస్ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ ఫోన్లు రెండూ కూడా క్వాడ్ HD + రిజల్యూషన్ మరియు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటాయి. వీరికి నోచ్ -లెస్ రూపకల్పనకు దగ్గరగా ఉన్న ఇన్ఫినిటీ ఓ ప్యానెల్ ఉంది, దీనిలో ముందు వైపు సెల్ఫీ కెమెరా ఉంటుంది.

శామ్సంగ్ గెలాక్సీ S20

ప్రాంతాన్ని బట్టి ఈ హ్యాండ్‌ సెట్‌ లు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 SoC లేదా Exynos 990 చిప్‌ సెట్ యొక్క శక్తితో వస్తాయి. ఈ హ్యాండ్‌ సెట్‌ లు రెండు LPDDR 5 ర్యామ్ వేరియంట్లలో 8 జిబి లేదా 12 జిబి (5 జి ఓన్లీ) తో 128 జిబి ఇంటర్నల్ స్టోరేజితో వస్తాయి. ఈ గెలాక్సీ ఎస్ 20 + 256 జిబి మరియు 512 జిబి స్టోరేజ్ మోడల్‌ ను పొందుతుంది. దీని స్టోరేజిని ఒక హైబ్రిడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా 1TB వరకు విస్తరించబవచ్చు. ఈ రెండు స్మార్ట్‌ ఫోన్లు దుమ్ము మరియు నీటి నిరోధకత కోసం IP68 సర్టిఫికేషన్ కలిగి ఉన్నాయి.

ఇక ఆప్టిక్స్ పరంగా చూస్తే, గెలాక్సీ ఎస్ 20 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది: 12MP ప్రైమరీ లెన్స్ + 12 MP  అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ 120 డిగ్రీలు మరియు f / 2.2 ఎపర్చరుతో ఉంటుంది. ఇందులో f / 2.0 ఎపర్చర్‌ గల 64MP టెలిఫోటో కెమెరాని కూడా వుంది . గెలాక్సీ ఎస్ 20 + లో ఒకే రకమైన కెమెరాలు ఉన్నాయి, అయితే ఇది డెప్త్ సెన్సార్ కలిగి ఉంటుంది (ఇది క్వాడ్-కెమెరాగా మారుతుంది). వెనుక కెమెరా సెటప్‌ లో స్పేస్ జూమ్ ఉంది, ఇది 3X యొక్క హైబ్రిడ్ ఆప్టిక్ జూమ్ మరియు 30X వరకు సూపర్-రిజల్యూషన్ జూమ్ ఇస్తుంది. వివిధ కోణాల కోసం అన్ని సెన్సార్ల ఫోటోతో పాటు చిన్న వీడియోను సంగ్రహించే 'సింగిల్ టేక్ ’అనే కొత్త ఫీచర్ కూడా ఉంది. ముందు భాగంలో 10MP సెల్ఫీ షూటర్ ఉంది.

శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 20 +

శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 20 ఒక 4000 ఎంఏహెచ్ బ్యాటరీని ప్యాక్ చేయగా, గెలాక్సీ ఎస్ 20 + 4500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. వీటిలో 25W ఫాస్ట్ ఛార్జింగ్ (బాక్స్‌లో ఛార్జర్ చేర్చబడింది) కు మద్దతు ఉంది. అంతేకాకుండా, ఈ హ్యాండ్‌ సెట్‌ లు ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ 2.0 మరియు రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తాయి.

ఈ రెండు స్మార్ట్‌ ఫోన్లు ఆండ్రాయిడ్ 10 ఆధారంగా OneUI 2.1 OS తో నడుస్తాయి. కనెక్టివిటీ ఎంపికల విషయానికొస్తే, హ్యాండ్‌సెట్లలో డ్యూయల్-బ్యాండ్ వై-ఫై 6, బ్లూటూత్ 5, NFC ఉన్నాయి. ఆడియో పరంగా, Dolby Atmos  సౌండ్‌తో స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి.

శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 20 అల్ట్రా : స్పెసిఫికేషన్లు

ఇక శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 20 అల్ట్రా విషయానికి వస్తే, ఇది సంస్థ నుండి వచ్చిన అత్యధిక ప్రీమియం స్మార్ట్ ఫోన్. ఇది 6.9-అంగుళాల QHD డైనమిక్ అమోలెడ్ 2 ఎక్స్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది కూడా పైన తెలిపిన రెండు స్మార్ట్ ఫోన్ల వంటి చిప్‌సెట్ మాదిరిగానే ఉంటుంది, అయితే ఇది 12GB లేదా 16GB RAM తో వస్తుంది. స్టోరేజి ఎంపికలలో LTE మరియు 5 జి వేరియంట్‌లకు 128 జిబి, 256 జిబి మరియు 512 జిబి నుండి ఉంటాయి. అప్షనల్ అడాప్టర్ ద్వారా 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ కు మద్దతు ఇచ్చే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని హ్యాండ్‌సెట్ ప్యాక్ చేస్తుంది.

శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 20 అల్ట్రా

ఇందులోని ఆప్టిక్స్ కూడా మారుతుంది. వైడ్-యాంగిల్ మరియు డెప్త్ కెమెరాలతో పాటు, ప్రాధమిక కెమెరా 108MP సెన్సార్, ఇది f / 1.8 ఎపర్చర్‌తో OIS మరియు PDAF కి మద్దతు ఇస్తుంది. ఇది f / 3.5 ఎపర్చరు, PDAF మరియు OIS తో 48MP టెలిఫోటో లెన్స్ ను కూడా కలిగి ఉంటుంది. గెలాక్సీ ఎస్ 20 అల్ట్రా లో కొత్త పెరిస్కోప్ తరహా టెలిఫోటో లెన్స్ కూడా ఉంది, ఇది 10x హైబ్రిడ్ ఆప్టికల్ జూమ్ మరియు 100x వరకు గరిష్టంగా ‘సూపర్-రిజల్యూషన్ జూమ్’ సాధించడానికి అనుమతిస్తుంది. ముందు భాగంలో 40MP  సెల్ఫీ షూటర్ ఉంది.

మూడు స్మార్ట్‌ ఫోన్ల ప్రారంభ ధర:

శామ్‌సంగ్ గెలాక్సీ S 20 5 జి: $ 999 (సుమారు రూ. 71,300)

శామ్‌సంగ్ గెలాక్సీ S 20 + 5 జి: $ 1,199 (సుమారు రూ .85,500)

శామ్‌సంగ్ గెలాక్సీ S 20 అల్ట్రా: $ 1,399 (సుమారు రూ .99,800)

భారతదేశం ధర లేదా లభ్యత గురించి ఇంకా ఎటువంటి ప్రకటన లేదు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo