రూ .6,999 ధరలో నోచ్ డిస్ప్లే , స్నాప్ డ్రాగన్ 450 చిప్సెట్ స్మార్ట్ ఫోన్ : RealMe C1

HIGHLIGHTS

తక్కువ ధరలో మంచి ఫీచర్లతో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ గురించి తెలుసుకోండి.

రూ .6,999 ధరలో నోచ్ డిస్ప్లే , స్నాప్ డ్రాగన్ 450 చిప్సెట్ స్మార్ట్ ఫోన్ : RealMe C1

రియల్ మీ కంపెనీ ఇప్పుడు నాల్గవ కొత్త ఫోన్ ప్రవేశపెట్టింది, అదే కొత్త స్మార్ట్ ఫోన్ రియల్ మీ సి1 .  ఈ ఎంట్రీ – లెవల్ స్మార్ట్ ఫోన్ యొక్క ధరను రూ . 6,990 గా రియల్ మీ ప్రకటించింది. ఈ ఫోన్ లో నోచ్ డిస్ప్లే,స్నాప్ డ్రాగన్ 450 చిప్సెట్ మరియు 4,230 mAh బ్యాటరీ వంటి మంచి లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి అది కూడా సౌకర్యవంతమైన ధరతో. ఈ స్మార్ట్ ఫోన్, అక్టోబరు 11 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకి ప్రత్యేకంగా ఫ్లిప్ కార్ట్ లో మొదటిసారిగా అమ్మకానికి ఉంటుంది. ఈ సమయానికంటే ముందే మంచి ఇంటర్నెట్ సౌకర్యంతో ఆన్లైన్లో ఉండవలసిఉంటుంది కొనడానికి ఇష్టపడేవారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

realeme-c1.jpg

రియల్ మీ సి 1 ప్రత్యేకతలు (స్పెసిఫికేషన్స్)

ఈ  రియల్ మీ సి 1 స్మార్ట్ ఫోన్  దానిపైన నోచ్ తో కూడిన ఒక 6.2 అంగుళాల డిస్ప్లే తో వస్తుంది మరియు ఇది మీకు ముందు నుండి చుస్తే రియల్ మి 2 వలెనే కనిపిస్తుంది.  ఇది స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. రియల్ మీ సి1 ఆండ్రాయిడ్ 8.1 ఓరెయో తో కూడిన కలర్ OS 5.1 తో నడుస్తుంది. అధిక సామర్ధ్యం గల, ఒక 4,230mAh బ్యాటరీని దీనికి అందించారు మరియు ఇది 2జీబీ  ర్యామ్ మరియు 16 జీబీ అంతర్గత మెమొరీతో వస్తుంది. దీనితో పాటుగా మెమొరీ కార్డుతో దీని స్టోరేజి 256జీబీ వరకు విస్తరించవచ్చు. దీని వెనుక యుని బాడీ గ్లాస్ ప్యానెల్ తో ఇచ్చారు మరియు  ఇది ఎంపిక చేసుకోగల రెండు రంగులలో లభిస్తుంది అవి – బ్లాక్ (నలుపు)  మరియు బ్లూ (నీలం). ఈ స్మార్ట్ ఫోన్ 13 MP + 2 MP  డ్యూయల్ – వెనుక కెమేరా హంగుతో వస్తుంది మరియు ముందు 5MP AI కెమేరాని కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo