రియల్ మీ ఇండియాలో లేటెస్ట్ విడుదల చేసిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Realme C35 స్మార్ట్ ఫోన్ మార్చ్ 12వ తేది మధ్యాహ్నం 12 గంటకి మొదటిసారిగా అమ్మకాలను కొనసాగించనుంది. ఈ రియల్ మీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ చాలా ఆకర్షణీయమైన డిజైన్ తో ఇండియాన్ మార్కెట్లో విడుదల చెయ్యబడింది. ఈ ఫోన్ 50MP AI ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ వంటి మరిన్ని ఫీచర్లతో వచ్చింది. రియల్ మీ సి35 యొక్క స్పెక్స్, ఫీచర్లు మరియు ధర వివరాలను గురించి ఈక్రింద చూడవచ్చు.
Survey
✅ Thank you for completing the survey!
Realme C35: ధర
రియల్ మీ సి35 స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ రెండు వేరియంట్స్ ధరలు ఈ క్రింద చూడవచ్చు.
1. 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర : Rs.11,999
2. 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర : Rs.12,999
ఈ ఫోన్ నలుపు మరియు గ్రీన్ కలర్ అప్షన్ లలో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ మార్చ్ 12వ తేదీ మద్యహ్నం 12 గంటలకి జరుగుతుంది.
Realme C35: స్పెక్స్
రియల్ మీ సి35 స్మార్ట్ ఫోన్ 6.6 అంగుళాల పరిమాణం గల FHD (2408×1080) రిజల్యూషన్ డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే 180 టచ్ శాంప్లింగ్ రేట్ మరియు 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ ఫోన్ యునిసోక్ టైగర్ T616 ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 4GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ Android 12 ఆధారంగా Realme UI R స్కిన్ పైన నడుస్తుంది.
ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఈ సెటప్ లో, 50MP ప్రధాన కెమెరాకి జతగా మ్యాక్రో సెన్సార్ మరియు B&W లెన్స్ ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం ముందుభాగంలో 8ఎంపి సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ లో డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్, డ్యూయల్ 4G VoLTE, USB-C సాకెట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్-బ్యాండ్ వైఫై మరియు బ్లూటూత్ 5.0 తో వంటి ఫీచర్లతో ఉంటుంది.