రెడ్మి నోట్ 8T స్మార్ట్ ఫోన్ను NFC మరియు 18వాట్స్ ఛార్జింగ్ టెక్నాలజీతో లాంచ్ చేయవచ్చు
ఈ రెడ్మి నోట్ 8 T ఎన్‌సిసి జాబితాలో కనిపించింది
రెడ్మి తన నోట్ 8 లైనప్‌ను విస్తరించాలని చూస్తోంది. ఇందులో భాగంగానే, రెడ్మి నోట్ 8T స్మార్ట్ ఫోన్ను త్వరలో విడుదల చేయడానికి చూస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ను ఎన్‌సిసి జాబితాలో గుర్తించారు, ఇది హ్యాండ్ సెట్ యొక్క అనేక వివరాలను వెల్లడించింది. ఈ రెడ్మి నోట్ 8 T ఎన్‌సిసి జాబితాలో కనిపించింది, కానీ సంస్థ నుండి మాత్రం ఎటువంటి అధికారిక టీజర్లు ఇంకా రాలేదు.
Surveyఆరోపించిన ఎన్‌సిసి లిస్టింగ్ ప్రకారం, ఈ రెడ్మి నోట్ 8 టికి ఇటీవల ప్రారంభించిన రెడ్మి నోట్ 8 కలిగినటువంటి ఫీచర్లు వంటివాటినే కలిగి ఉంటుంది. వీటితో పాటు, రెడ్మి నోట్ 8 T NFC ఆన్ బోర్డ్‌తో ప్రారంభించవచ్చు. ఈ జాబితాదీన్ని M1908C3XG మోడల్ నంబర్‌తో చూపిస్తుంది. ఇంకా, ఈ డివైజ్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతు కలిగి ఉండవచ్చని పేర్కొంది.
గత లీక్ ల ప్రకారం, రెడ్మి నోట్ 8 Tలో ఒక 6.3-అంగుళాల డిస్ప్లే ను డ్యూ డ్రాప్ నోచ్ తో కలిగి ఉండవచ్చు. ఇది ముందు మరియు వెనుక భాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ను కలిగి ఉంటుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 665 చిప్ సెట్ యొక్క శక్తితో ఉండవచ్చు. ఇంకా, ఈ స్మార్ట్‌ఫోన్ 48 MP క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతుతో 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది యుఎస్‌బి టైప్-సి పోర్ట్ మరియు హెడ్ ఫోన్ జాక్‌తో కూడి ఉంటుంది.
అదనంగా, ఈ రెడ్మి 8 T మల్టి ర్యామ్ మరియు స్టోరేజ్ వేరియంట్‌లలో రావచ్చు. మూడు వేరియంట్లలో, 32 జీబీ స్టోరేజ్‌తో 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌తో 4 జీబీ ర్యామ్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ లభిస్తుంచవచ్చని మునుపటి నివేదికలు పేర్కొన్నాయి. 4 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర యూరో 199 గా ఉంటుందని, ఇది సుమారు రూ .15,500 కు సమానంగా ఉంటుందని చెప్పారు.
వాస్తవానికి, రెడ్మి నోట్ 8 T లభ్యతపై ఇంకా ఎటువంటి వివరాలు బయటకిరాలేదు, అయితే ఇది ఎన్‌సిసి జాబితాలో కనిపించినందున త్వరలో ప్రారంభించవచ్చని అంచనావేస్తున్నారు.