రెడ్మి నోట్ 8 కొనాలంటే 25 తారీఖు వరకు ఎదురుచుడాల్సిందే

HIGHLIGHTS

అక్టోబరు 25 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకి జరిగించాడనికి తేదీని ప్రకటించింది.

రెడ్మి నోట్ 8 కొనాలంటే 25 తారీఖు వరకు ఎదురుచుడాల్సిందే

షావోమి, ఒక ప్రధాన 48MP  క్వాడ్ కెమేరాతో పాటుగా మరెన్నో ప్రత్యేకతలు కలిగిన  REDMI NOTE 8 ను చాలా చౌక ధరకే ఇండియాలో తీసుకురావడంతో, జరిగిన రెండు ఫ్లాష్ సేల్ లో కొనుగోలుదారులు ఎగబడి కొనేశారు. కేవలం కొన్ని నిముషాల్లోనే ఈ స్మార్ట్ ఫోన్ అన్ని యూనిట్లు అమ్ముడయ్యాయంటే ఆశ్చర్యపడాల్సిన  అవసరంలేదు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ యొక్క తరువాతి ఫ్లాష్ సేల్ అక్టోబరు 25 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకి జరిగించాడనికి తేదీని ప్రకటించింది. కాబట్టి, ఈ ఫోన్ కొనడానికి ఎదురుచూస్తున్న వారు అప్పటివరకూ ఆగాల్సిందే.       

Digit.in Survey
✅ Thank you for completing the survey!

రెడ్మి నోట్ 8 : ధరలు

1. రెడ్మి నోట్ 8  (4GB +64GB ) – Rs.9,999/-

2. రెడ్మి నోట్ 8 (6B +128GB ) – Rs.12,999/-

రెడ్మి నోట్ 8 ప్రత్యేకతలు

రెడ్మి నోట్ 8 ప్రో ఒక 6.3-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. ఇది FHD+ రిజల్యూషన్ కలిగి యాస్పెక్ట్ రేషీతో వస్తుంది మరియు ఈ డిస్ప్లే ఒక కార్ణింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో ఉంటుంది. ఇక వెనుక భాగంలో కూడా ఇది గొరిల్లా గ్లాస్ 5 తో వస్తుంది. అదనంగా, ఇందులో 2.0Ghz క్లాక్ స్పీడ్ అందించగల ఒక స్నాప్ డ్రాగన్ 665 ఆక్టా కోర్ చిప్‌సెట్‌ తో వచ్చింది. దీనికి జతగా ఒక 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజితో వస్తుంది.

ఇక కెమేరాల విషయానికి వస్తే, ఈ రెడ్మి నోట్ 8 మొబైల్ ఫోనులో గరిష్టంగా ఒక  48 MP సెన్సార్ గల క్వాడ్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఈ ప్రధాన కెమేరాకి జతగా ఒక 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సారుతో పాటుగా ఒక మరియు  కెమెరాను అందించింది, ఇది ఎఫ్ / 1.7 ఎపర్చర్‌తో లభిస్తుంది. ఇది కాకుండా, మీరు ఈ ఫోన్లో 13MP సెల్ఫీ కెమెరాను కూడా పొందుతారు. అలాగే, ఈ మొబైల్ ఫోన్‌లో, అంటే రెడ్మి నోట్ 8 లో,ఒక 4,000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని కూడా ఇచ్చింది. అంతేకాదు, ఇది 18W స్పీడ్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటుగా బాక్స్ లోనే ఒక 18W చార్జరుతో వస్తుంది.    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo