Redmi Note 17 5G launch date confirmed with 8000 mah battery
గత నాలుగైదు రోజులుగా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Redmi Note 17 5G కోసం టీజింగ్ చేస్తూ వచ్చిన షియోమీ, ఈ రోజు ఈ ఫోన్ లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ mAh మాస్టర్ గా లాంచ్ అవుతుందట. అంటే, ఈ ఫోన్ బ్యాటరీ గురించి ఈ షియోమీ ఈ విధంగా చెబుతోంది. ఈ షియోమీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫోన్ వివరాలు చూద్దాం.
రెడ్ మీ నోట్ 17 స్మార్ట్ ఫోన్ ని ఆగస్టు 6వ తేదీన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్లు షియోమీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను అమెజాన్ ద్వారా టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ లాంచ్ కోసం ప్రత్యేకంగా అమెజాన్ ద్వారా అందించిన టీజర్ లో ఈ ఫోన్ కీలక ఫీచర్లు కూడా రిలీజ్ చేసింది.
రెడ్ మీ నోట్ 17 5జి స్మార్ట్ ఫోన్ భారీ 8000 mAh బ్యాటరీతో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ బ్యాటరీ డీటెయిల్స్ ను కంపెనీ అఫీషియల్ గా రివీల్ చేసింది. అంటే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ప్రత్యేకమైన 5జి ఫోన్ లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ డిజైన్ ను కూడా కంపెనీ రివీల్ చేసింది. ఈ ఫోన్ కలిగిన బిగ్ బ్యాటరీ కారణంగా ఈ ఫోన్ కొంచెం మందంగా ఉంటుంది.
ఈ ఫోన్ లో వెనుక పెద్ద కెమెరా మోడ్యూల్ ఉంది మరియు ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ కెమెరా సెటప్ లో ఉన్న సెన్సార్ వివరాలు ఇంకా రిలీజ్ చేయలేదు. అయితే, ఇందులో 50MP ప్రధాన కెమెరా వుండే అవకాశం ఉంటుందని కొన్ని లీక్స్ చెబుతున్నాయి.
Also Read : OnePlus N6x: లాంచ్ కంటే ముందే సేల్ డేట్ కూడా కన్ఫర్మ్ చేసిన వన్ ప్లస్.!
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లో 6.8 అంగుళాల FHD+ OLED డిస్‌ప్లే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అంతేకాదు, ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గొప్ప బ్రైట్నెస్ కూడా కలిగి ఉండవచ్చు. కొన్ని లీక్స్ ప్రకారం, ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 4 Gen 4 చిప్ సెట్ తో లాంచ్ కావొచ్చని కూడా తెలుస్తోంది. ఇదే కాదు ఇందులో 12GB వరకు ర్యామ్ ఫీచర్ మరియు 256GB వరకు భారీ స్టోరేజ్ కూడా ఉండే అవకాశం ఉండొచ్చని అంచనా.
ఈ ఫోన్ గురించి వచ్చిన లీక్స్ చూస్తుంటే, ఈ ఫోన్ బడ్జెట్ యూజర్ కోసం షియోమీ తీసుకొస్తున్న బిగ్ బ్యాటరీ బడ్జెట్ ఫోన్ అయ్యే అవకాశం ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, ఇవన్నీ కూడా లీక్స్ అండ్ అంచనా ఫీచర్స్ మాత్రమే. ఈ ఫోన్ అఫీషియల్ ఫీచర్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఈ ఫోన్ ఫీచర్స్ లో ఎన్ని నిజం అవుతాయో తెలుస్తుంది.