REDMI Note 15 SE 5G first sale starts with huge deals on tomorrow
REDMI Note 15 SE 5G: రెడ్ మీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ నోట్ 15 SE మొదటిసారి సెల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ మొదటి సెల్ నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా యూజర్ల కోసం అందించింది. ఈ ఫోన్ సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో మార్కెట్లో అడుగుపెట్టింది. సేల్ కంటే ముందే ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ప్రైస్, ఆఫర్స్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.
ఈ ఫోన్ బేసిక్ ( 6GB + 128GB) వేరియంట్ ను రూ. 19,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. అలాగే, ఈ ఫోన్ ( 8GB + 128GB) వేరియంట్ ను రూ. 21,999 ధరతో మరియు రెడ్ మీ నోట్ 15 SE 5జి హై ఎండ్ ( 8GB + 256GB) వేరియంట్ ను రూ. 23,999 ధరతో లాంచ్ చేసింది. ఫ్రొస్టెడ్ వైట్, కార్బన్ బ్లాక్ మరియు క్రిమ్సన్ రిజర్వ్ మూడు రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది.
రెడ్ మీ నోట్ 15 SE పై రెండు భారీ డీల్స్ అందించింది. ఒకటి రూ. 2000 రూపాయల అదనపు చేంజ్ బోనస్ ఆఫర్ మరియు రెండోది HDFC, SBI మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూ. 2,000 బ్యాంక్ డిస్కౌంట్. అయితే, ఈ రెండు ఆఫర్ లలో ఏదైనా ఒకటి మాత్రమే లభిస్తుంది. రేపటి నుంచి ఈ ఫోన్ సేల్ ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో స్టార్ అవుతుంది.
Also Read: BSNL Best Plan: ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే చాలు 72 రోజులు నిశ్చింతగా ఉండొచ్చు.!
ఈ రెడ్ మీ నోట్ 15 స్పెషల్ ఎడిషన్ చాలా స్లీక్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఎందుకంటే, ఈ ఫోన్ కేవలం 7.35mm మందంతో సూపర్ స్లీక్ గా ఉంటుంది. ఇందులో 6.77 ఇంచ్ కర్వుడ్ AMOLED డిస్ప్లే ఉంది. ఈ డిస్ప్లే FHD+ రిజల్యూషన్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మరియు 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి స్టన్నింగ్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. రెడ్ మీ ఈ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon 6 Gen 3 చిప్ సెట్ తో అందించింది. ఇందులో 8 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ హెవీ స్టోరేజ్ కూడా అందించింది.
ఈ ఫోన్ 50 ఎంపీ మెయిన్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 20 ఎంపీ సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్, ఏఐ కెమెరా ఫీచర్స్ మరియు షియోమీ కెమెరా ఫిల్టర్లు కలిగి ఉంటుంది. ఇందులో 5800 mAh బిగ్ బ్యాటరీ మరియు 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా అందించింది. అంతేకాదు, 18W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో జత చేసింది. IP65 మరియు 64 రేటింగ్ తో ఈ ఫోన్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో వస్తుంది.