REDMI Note 15 SE 5G: భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఫస్ట్ సేల్ కి సిద్ధమైన రెడ్ మీ ఫోన్.!

HIGHLIGHTS

రెడ్ మీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ నోట్ 15 SE మొదటిసారి సేల్ కి అందుబాటులోకి వస్తుంది

REDMI Note 15 SE 5G మొదటి సేల్ నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా యూజర్ల కోసం అందించింది

సేల్ కంటే ముందే ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ప్రైస్, ఆఫర్స్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి

REDMI Note 15 SE 5G: భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఫస్ట్ సేల్ కి సిద్ధమైన రెడ్ మీ ఫోన్.!

REDMI Note 15 SE 5G: రెడ్ మీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ నోట్ 15 SE మొదటిసారి సెల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ మొదటి సెల్ నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా యూజర్ల కోసం అందించింది. ఈ ఫోన్ సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో మార్కెట్లో అడుగుపెట్టింది. సేల్ కంటే ముందే ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ప్రైస్, ఆఫర్స్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

REDMI Note 15 SE 5G: ప్రైస్ అండ్ ఆఫర్స్

ఈ ఫోన్ బేసిక్ ( 6GB + 128GB) వేరియంట్ ను రూ. 19,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. అలాగే, ఈ ఫోన్ ( 8GB + 128GB) వేరియంట్ ను రూ. 21,999 ధరతో మరియు రెడ్ మీ నోట్ 15 SE 5జి హై ఎండ్ ( 8GB + 256GB) వేరియంట్ ను రూ. 23,999 ధరతో లాంచ్ చేసింది. ఫ్రొస్టెడ్ వైట్, కార్బన్ బ్లాక్ మరియు క్రిమ్సన్ రిజర్వ్ మూడు రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది.

REDMI Note 15 SE 5G First sale

ఆఫర్స్ :

రెడ్ మీ నోట్ 15 SE పై రెండు భారీ డీల్స్ అందించింది. ఒకటి రూ. 2000 రూపాయల అదనపు చేంజ్ బోనస్ ఆఫర్ మరియు రెండోది HDFC, SBI మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూ. 2,000 బ్యాంక్ డిస్కౌంట్. అయితే, ఈ రెండు ఆఫర్ లలో ఏదైనా ఒకటి మాత్రమే లభిస్తుంది. రేపటి నుంచి ఈ ఫోన్ సేల్ ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో స్టార్ అవుతుంది.

Also Read: BSNL Best Plan: ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే చాలు 72 రోజులు నిశ్చింతగా ఉండొచ్చు.!

REDMI Note 15 SE 5G: ఫీచర్స్

ఈ రెడ్ మీ నోట్ 15 స్పెషల్ ఎడిషన్ చాలా స్లీక్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఎందుకంటే, ఈ ఫోన్ కేవలం 7.35mm మందంతో సూపర్ స్లీక్ గా ఉంటుంది. ఇందులో 6.77 ఇంచ్ కర్వుడ్ AMOLED డిస్ప్లే ఉంది. ఈ డిస్ప్లే FHD+ రిజల్యూషన్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మరియు 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి స్టన్నింగ్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. రెడ్ మీ ఈ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon 6 Gen 3 చిప్ సెట్ తో అందించింది. ఇందులో 8 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ హెవీ స్టోరేజ్ కూడా అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo