Redmi Note 15 5G: రేపు లాంచ్ అయ్యే రెడ్ మీ ఫోన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇదిగో.!
రెడ్ మీ నోట్ 15 స్మార్ట్ ఫోన్ రేపు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది
రెడ్ మీ నోట్ 15 స్మార్ట్ ఫోన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి
ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ కంపెనీ చాలా రోజులు ముందుగానే వెల్లడించింది
Redmi Note 15 5G: రెడ్ మీ నోట్ 15 స్మార్ట్ ఫోన్ రేపు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. అయితే, ఈ ఫోన్ లాంచ్ కంటే ఒకరోజు ముందుగా, అంటే ఈరోజు రెడ్ మీ నోట్ 15 స్మార్ట్ ఫోన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ మరియు ఈ అప్ కమింగ్ ఫోన్ అంచనా ధర వంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రోజు మీకు అందిస్తున్నాము.
SurveyRedmi Note 15 5G: లాంచ్ డేట్
రెడ్ మీ నోట్ 15 స్మార్ట్ ఫోన్ రేపు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్లో ఆకట్టుకునే ఫీచర్స్ మరియు సరికొత్త డిజైన్ తో లాంచ్ అవుతుందని షియోమీ టీజింగ్ చేస్తోంది.
అంచనా ప్రైస్:
షియోమీ ఈ ఫోన్ ను ఇండియాలో అండర్ రూ. 20,000 రూపాయల సెగ్మెంట్ లో లాంచ్ చేసే అవకాశం ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేసి చెబుతున్నారు.
Redmi Note 15 5G : ఫీచర్స్
ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ కంపెనీ చాలా రోజులు ముందుగానే వెల్లడించింది. అయితే, మిగిలిన వివరాలు ఆన్లైన్ లో వచ్చిన లీక్స్ వెల్లడించాయి. ఈ వివరాలు ద్వారా ఈ పూర్తి వివరాలు ఈరోజు అందించాము. ఈ ఫోన్ సరికొత్త కర్వ్డ్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ ను కేవలం 7.35mm మందంతో సూపర్ స్లీక్ ఫోన్ గా లాంచ్ చేస్తుంది.

ఈ రెడ్ మీ నోట్ 15 స్మార్ట్ ఫోన్ 6.77 ఇంచ్ కర్వుడ్ AMOLED స్క్రీన్ తో లాంచ్ అవుతుంది. ఈ స్క్రీన్ 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హైడ్రో టచ్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు FHD+ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ యొక్క Snapdragon 6 Gen 3 5G ప్రోసెసర్ తో లాంచ్ అవుతుంది.
ఈ ఫోన్ లో 108MP మెయిన్ సెన్సార్ మరియు 8MP అల్ట్రా వైడ్ సెకండరీ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 20MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఇది 4K వీడియో రికార్డింగ్ మరియు Ai కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 5520 mAh బ్యాటరీ ఉంటుంది మరియు ఈ ఫోన్ 45W`ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది IP66 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ గా ఉంటుంది.
Also Read: Realme 16 Pro 5G: లాంచ్ డేట్, ఫీచర్స్ మరియు ప్రైస్ కంప్లీట్ రౌండప్.!
ఈ అప్ కమింగ్ ఫోన్ మరింత ఆకట్టుకునే ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉందని మరి కొందరు చెబుతున్నారు. ఇంకెంత జస్ట్ ఒక్క రోజులో ఈ ఫోన్ ప్రైస్ సస్పెన్స్ కంప్లీట్ అవుతుంది.