షియోమి ఇండియాలో విడుదల చేయబుతున్న Redmi 200MP కెమెరా ఫోన్ ధర మరియు వేరియంట్స్ ఇప్పుడు ఆన్లైన్ల్ లీకయ్యాయి. 2023 జనవరి 5న ఇండియాలో Redmi Note 12 Pro+ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయనున్నట్లు షియోమి డేట్ ప్రకటించింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క అంచనా ధరలను మరియు వేరియంట్ లను ప్రముఖ టిప్స్టర్ పారస్ గుగ్లాని తన ట్విట్టర్ హ్యాండిల్ నుండి ట్వీట్ చేశారు. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి సూచించిన ధర మరియు వేరియంట్ వివరాలను తెలుసుకోండి.
Survey
✅ Thank you for completing the survey!
పారస్ గుగ్లాని ట్వీట్ ప్రకారం, రెడ్ మి నోట్ 12 ప్రో+ స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్ లను కలిగి ఉంటుంది. ఇందులో, బేసిక్ వేరియంట్ 6GB మరియు 128GB స్టోరేజ్ తో రూ.24,999 ధరతో, 8GB మరియు 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.26,999 ధరతో మరియు హై ఎండ్ వేరియంట్ 8GB మరియు 256GB స్టోరేజ్ తో రూ.28,999 ధరతో ఉండవచ్చని సూచించారు. ఈ ట్వీట్ ను క్రింద చూడవచ్చు.