Redmi Note 11s : 108MP క్వాడ్ కెమెరాతో విడుదలైన రెడ్ మీ కొత్త ఫోన్
Redmi Note 11 సిరీస్ నుండి రెండు కొత్త ఫోన్లను విడుదల చేసింది
రెడ్ మీ నోట్ 11s మిడ్ రేంజ్ ధరలో వచ్చింది
AMOLED డిస్ప్లే మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
షియోమి ఈరోజు ఇండియాలో Redmi Note 11 సిరీస్ నుండి రెండు కొత్త ఫోన్లను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్లలో నోట్ 11s మిడ్ రేంజ్ ధరలో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ వేగవంతమైన ప్రోసెసర్, AMOLED డిస్ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు మరిన్ని ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లో ప్రవేశించింది. మరి ఈరోజు విడుదలైన ఈ లేటెస్ట్ రెడ్ మీ నోట్ 11s ఫోన్ల గురించి తెలుసుకుందామా.
SurveyRedmi Note 11s: ధర
రెడ్ మీ నోట్ 11s స్టార్టింగ్ వేరియంట్ (6GB+64GB) రూ.16,499 ధరతో, (6GB+128GB) వేరియంట్ రూ.17,499 ధరతో, హై ఎండ్ (8GB+128GB) వేరియంట్ రూ.18,499 ధరతో ప్రకటించబడ్డాయి.
Redmi Note 11s: స్పెక్స్
ఈ స్మార్ట్ ఫోన్ 6.43 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లే ని కలిగివుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో పాటుగా 1000 నిట్స్ గరిష్ఠ బ్రెట్నెస్ వరకూ అందించగలదు. ఈ ఫోన్ మీడియాటెక్ Helio G96 ఆక్టా కోర్ ప్రోసెసర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 8జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజ్ లను కూడా కలిగివుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11ఆధారితమైన MIUI 13 స్కిన్ పైన నడుస్తుంది.
కెమెరా విషయానికి వస్తే, 11s స్మార్ట్ ఫోన్ వెనుక క్వాడ్ కెమెరా సెటప్ కలిగివుంది. ఇందులో, 108MP Samsung HM2 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2MP మాక్రో మరియు 2MP డెప్త్ కెమెరాలను జతగా కలిగి ఉంటుంది. ఈ కెమెరాలు FHD లో 30fps వరకూ రికార్డ్ చేయగలదు. సెల్ఫీల కోసం ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంది.
Redmi Note 11s ఫోన్ 33W ప్రో ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీతో వస్తుంది. అదనపు ఫీచర్ల విషయానికి వస్తే, ఈ రెండు ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లు మరియు Hi-Res సర్టిఫికేషన్ తో వస్తుంది. సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు AI ఫేస్ అన్లాక్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో వుంది.