షియోమి ఇండియాలో మరొక లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ విడుదల చెయ్యడానికి లాంచ్ డేట్ ప్రకటించింది. ఫిబ్రవరి 9 న ఇండియాలో Redmi Note 11s స్మార్ట్ ఫోన్ ను విడుదల చేస్తున్నట్లు షియోమి ప్రకటించింది. అంటే, అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 5G సపోర్ట్ తో వస్తుందో లేదో అలాగే ఈ ఫోన్ యొక్క స్పెక్స్ గురించి పూర్తి సమాచారాన్ని ఇంకా అందించలేదు. అయినప్పటికీ, ఈ ఫోన్ AMOLED డిస్‌ప్లేతో పాటు క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుందని మేము ఆశిస్తున్నాము.
Survey
✅ Thank you for completing the survey!
షియోమి వెబ్సైట్ నుండి అందించిన Redmi Note 11s టీజింగ్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ క్వాడ్ కెమెరా సెటప్ కి జతగా ఒక LED ఫ్లాష్ ను కూడా కలిగి ఉన్నట్లుగా కనిపిస్తోంది. దీని ప్రకారం, ఈ స్మార్ట్ ఫోన్ 108-మెగాపిక్సెల్ Samsung ISOCELL HM2 ప్రైమరీ కెమెరా మరియు రెండు 2MP సెన్సార్ లతో పాటుగా 8MP సోనీ IMX355 సెన్సార్‌తో కూడా రావచ్చని భావిస్తున్నారు. అయితే, ఈ ఫోన్ పైన ఎటువంటి 5G బ్రాండింగ్ లేకపోవడం వలన ఇది 4G సపోర్ట్ తో రావచ్చని సూచిస్తుంది.
వాస్తవానికి, గత నెలలో షియోమి తన Redmi 11 సిరీస్ నుండి బడ్జెట్ 16 వేల బడ్జెట్ ధరలోనే Redmi Note 11T 5G తీసుకొచ్చింది. కాబట్టి, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 15 వేల రూపాయల సబ్ కేటగిరిలో రావచ్చని కూడా అంచనా వేస్తున్నారు. ధర విషయం పక్కన పెడితే, షియోమి ఈ ఫోన్ ఫీచర్లను ఒక్కొక్కటిగా రివీల్ చేయనున్నది కాబట్టి, మరింత సంచారంతో మీ ముందుకు వస్తాము.