Redmi Note 11 Pro Series: విడుదలకు సిద్దమైన రెడ్ మీ కొత్త ఫోన్లు
Redmi Note 11 Pro ఫోన్లను మార్చి 9న విడుదల చేస్తునట్లు ప్రకటించింది
టీజర్ లో రెండు ఫోన్ల కొన్ని ఫీచర్లు కూడా బయటపెట్టింది
Redmi Note 11 Pro సిరీస్ నుండి ఇండియాలో ఇప్పటికే రెండు ఫోన్లను విడుదల చేసిన రెడ్ మీ, ఇపుడు మరొక రెండు ఫోన్లను విడుదల చెయ్యడానికి సిద్దమయ్యింది. Redmi Note 11 Pro Series నుండి నోట్ 11 ప్రో మరియు నోట్ 11 ప్రో+ ఫోన్లను భారతదేశంలో మార్చి 9న విడుదల చేస్తునట్లు ప్రకటించింది. ఈ ఫోన్స్ షియోమీ అధికారిక వెబ్సైట్ మరియు Amazon ద్వారా టీజ్ చేయబడ్డాయి. ఈ టీజర్ లో రెండు ఫోన్ల కొన్ని ఫీచర్లు కూడా బయటపెట్టింది. ఈ ఫోన్స్ 108MP కెమెరా, 67W ఫాస్ట్ ఛార్జింగ్, 120Hz అధిక రిఫ్రెష్ రేట్ మరియు 5G సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
SurveyRedmi Note 11 Pro Series: అంచనా స్పెక్స్
ఈ సిరీస్ నుండి తీసుకురానున్న ఫోన్ల యొక్క కొన్ని కీలకమైన వివరాలను కంపెనీ టీజర్ ద్వారా బయటపెట్టింది. వీటి ద్వారా మరిన్ని స్పెక్స్ ను అంచనా వేస్తున్నారు. ఈ సిరీస్ ఫోన్లను 6.67-ఇంచ్ FHD+ సూపర్ AMOLED డిస్ప్లేతో ఉండవచ్చు. అలాగే టీజర్ ప్రకారం, ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది మరియు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో అందించే అవకాశం ఉంది.
ఈ ఫోన్లలో 108MP ప్రధాన కెమెరా గురించి ఇప్పటికే ప్రకటించింది. అయితే, రెండు ఫోన్ల కెమెరా సెటప్ లో ఉండే మైన్ కెమెరాలో అంతరం ఉంటుంది. 108 MP మైన సెన్సార్ Pro+ వేరియంట్ తో రావచ్చు.
ఇక ఇంటర్నల్ స్పెక్స్ లోకి వెళితే, ప్రో ఎడిషన్‌లో హీలియో G96 ప్రోసెసర్ ఉండవచ్చు మరియు Pro+ డైమెన్సిటీ 920 5G ప్రాసెసర్‌ని కలిగి ఉండవచ్చు. నోట్ 11 ప్రో+ వేరియంట్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఉంటే, నోట్ 11 ప్రో+ మాత్రం ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఉండవచ్చు. అలాగే, నోట్ 11 ప్రో ప్లస్ 5000mAh బ్యాటరీతో రావచ్చు, అయితే ప్రో మాత్రం చిన్న 4500mAh బ్యాటరీ తో ఉండవచ్చు.