Redmi Note 10T 5G : బడ్జెట్ ధరలోనే వచ్చిన షియోమీ 5G ఫోన్
Redmi Note 10T 5G ఇండియాలో వచ్చింది
బడ్జెట్ ఫ్రెండ్లీ 5G ప్రొసెసర్
48MP ట్రిపుల్ కెమెరా
ఈరోజు షియోమీ తన లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ Redmi Note 10T 5G ని ఇండియాలో విడుదల చేసింది. షియోమీ ఈ 5G స్మార్ట్ ఫోన్ ను కేవలం బడ్జెట్ ధరలోనే ప్రకటించింది. రెడ్‌మి నోట్ 10 టి బడ్జెట్ ఫ్రెండ్లీ 5G ప్రొసెసర్ Dimensity 700 SoC మరియు 48MP ట్రిపుల్ కెమెరా వంటి చాలా ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చింది.
SurveyRedmi Note 10T 5G: ప్రైస్
రెడ్‌మి నోట్ 10 టి యొక్క 4జిబి మరియు 64జిబి స్టోరేజ్ వేరియంట్ కేవలం రూ.13,999 రూపాయల ధరతో ప్రకటించబడింది. ఈ ఫోన్ యొక్క మరొక వేరియంట్ 4జిబి మరియు 64జిబి స్టోరేజ్ ధర రూ. 15,999. ఈ ఫోన్ పైన ప్రారంభ అఫర్ క్రింద HDFC బ్యాంక్ కస్టమర్ల కోసం డిస్కౌంట్ అఫర్ ను కూడా అందించింది. ఈ ఫోన్ మొదటి సేల్ జూలై 26 న మధ్యాహ్నం 12 గంటలకు మొదలువుతుంది.
Redmi Note 10T 5G: స్పెక్స్
రెడ్‌మి నోట్ 10 టి స్మార్ట్‌ఫోన్ 6.5 ఇంచ్ FHD + రిజల్యూషన్ గల పంచ్ హోల్ డిస్ప్లే తో వుంటుంది. ఈ డిస్ప్లే 90 Hz రిఫ్రెష్ రేట్ మరియు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ Dimensity 700 ఆక్టా కోర్ 5G ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఈ ఫోన్ గ్రాఫైట్ బ్లాక్, క్రోమియం వైట్, మింట్ గ్రీన్ మరియు మెటాలిక్ బ్లూ అనే నాలుగు కలర్ అప్షన్ లలో లభిస్తుంది.
రెడ్‌మి నోట్ 10 టి యొక్క కెమెరా సెటప్ విషయానికి వస్తే, ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగివుంది. ఇందులో 48MP ప్రధాన కెమెరా, 2ఎంపి మ్యాక్రో మరియు 2ఎంపి డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందుభాగంలో 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. రెడ్‌మి నోట్ 10 టి లో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బ్యాటరీ ఉంది మరియు 22.5W ఫాస్ట్ చార్జర్ బాక్స్ తోపాటుగా వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
