ఇండియాలో POCO F3 స్మార్ట్ ఫోన్ త్వరలోనే వచ్చే ఛాన్స్

ఇండియాలో POCO F3 స్మార్ట్ ఫోన్ త్వరలోనే వచ్చే ఛాన్స్
HIGHLIGHTS

POCO F3 త్వరలోనే లాంచ్ అవబోతోందా

POCO F3 ఫోన్ రెడ్మి 40 యోక్క రీ బ్రాండింగ్ ఫోన్ అవుతుందా

పోకో F3 ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయి

ఇటీవలే, షియోమీ తన Redmi K40 సిరీస్ నుండి మూడు స్మార్ట్ ఫోన్లను చైనాలో విడుదల చేసింది. ఈ సిరీస్ నుండి రెడ్మీ K40, రెడ్మీ K40 ప్లస్ మరియు రెడ్మీ K40 ప్లస్ ప్రో మూడు ఫోన్లను లాంచ్ చేసింది. ఈ మూడు ఫోన్లు కూడా ప్రీమియం ఫీచర్లతో తీసుకురాబడ్డాయి. అయితే, ఈ మూడు ఫోన్లలో స్టార్టింగ్ వేరియంట్ అయిన Redmi K40 ను POCO F3 పేరుతో రీబ్రాండ్ గా ఇండియాలో లాంచ్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

US ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (FCC) లీక్ చేసిన ఒక డాక్యుమెంట్ ద్వారా Redmi K40 ను POCO F3 పేరుతో రీబ్రాండ్ గా ఇండియాతో సహా పలుదేశాల్లో విడుదల చెయ్యడానికి చూస్తునట్లు అర్ధమవుతోంది. ఇదే కనుక నిజమైతే శక్తివంతమైన ప్రాసెసర్, డిస్ప్లే  మరియు కెమెరాలతో చైనాలో విడుదలైన ఈ ఫోన్ ఇండియాలో POCO F3 గా అవతరించవచ్చు.

షియోమి చైనాలో లాంచ్ చేసిన ఈ రెడ్‌మి కె40 ఫోన్ చాలా సన్నగా కేవలం 7.8 మిల్లి మీటర్ల మందంతో తీసుకొచ్చింది. ఈ రెడ్‌మి కె40  స్మార్ట్‌ఫోన్ లో HDR 10+ సర్టిఫికెట్ మరియు 120Hz హై రిఫ్రెష్ రేట్ కలిగిన ఒక 6.67అంగుళాల FHD+ రిజల్యూషన్ AMOLED డిస్ప్లే ని అందించింది. అంటే, కంటెంట్ ను మంచి క్లారిటీ తో పాటుగా క్లియర్ గా చూడవచ్చు.

ఇక ఈ రెడ్‌మి కె40 ప్రోసెసర్ విషయానికి వస్తే, రెడ్‌మి కె40 ఫోన్ స్నాప్ డ్రాగన్ 870 చిప్సెట్ శక్తితో పనిచేస్తాయి మరియు 12GB ర్యామ్ మరియు 256 UFS 3.1 వరకూ స్టోరేజ్ తో వస్తుంది. ఇది MIUI స్కిన్ పైన ఆండ్రాయిడ్ 11 OS పైన పని చేస్తుంది. ఇందులో, 4030 mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి వుంది.        

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo