చైనాలో విడుదలైన రెడ్మి K30 ప్రో 5G, జూమ్ ఎడిషన్

చైనాలో విడుదలైన రెడ్మి K30 ప్రో 5G, జూమ్ ఎడిషన్
HIGHLIGHTS

రెండు ఫోన్లు కూడా డిజిటల్‌గా 30x వరకు జూమ్‌ కు మద్దతు ఇస్తాయి

చైనాలో జూమ్ ఎడిషన్‌తో పాటుగా రెడ్మి కె 30 ప్రో ప్రారంభించబడింది. ఈ ఫోన్లు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 చిప్‌ సెట్ ద్వారా పనిచేస్తాయి. ముందు టీజ్ చేసినట్లుగా, అవి LPDDR 5 ర్యామ్, UFS  3.1 స్టోరేజ్ సిస్టమ్ మరియు ఫ్రంట్ ఫేసింగ్ పాప్-అప్ కెమెరాను కలిగి ఉంటాయి. రెడ్మి కె 30 ప్రో లో ఒక 6.67-అంగుళాల 1080p AMOLED  డిస్ప్లే ఉంది. ఇది HDR10 + మరియు 60Hz రిఫ్రెష్ రేటుకు మద్దతు ఇస్తుంది.

ఆప్టిక్స్ పరంగా, రెడ్మి కె 30 ప్రో వృత్తాకార మాడ్యూల్‌ లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది: ఒక 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 13 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ + 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా + 5 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్  సామర్థ్యాలతో వస్తుంది. ఇక జూమ్ ఎడిషన్ విషయానికొస్తే, ఇది 64 మెగాపిక్సెల్ సెన్సార్‌పై OIS ను మరియు OIS మద్దతుతో 5 మెగాపిక్సెల్ కెమెరాకు బదులుగా 8 మెగాపిక్సెల్ సెన్సార్‌ను పొందుతుంది. రెండు ఫోన్లు కూడా డిజిటల్‌గా 30x వరకు జూమ్‌ కు మద్దతు ఇస్తాయి మరియు Raw వంటి విభిన్న ఫార్మాట్‌లకు మద్దతు ఇస్తాయి. ముందు భాగంలో 20 మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ షూటర్ ఉంది.

ఇతర స్పెక్స్‌విధయానికి వస్తే, 8 కె వీడియో రికార్డింగ్, హెడ్‌ఫోన్ జాక్, IP53 వాటర్ రెసిస్టెన్స్, NFC , IR బ్లాస్టర్, మరియు వై-ఫై 6 ఉన్నాయి. ఇది 4700 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ప్యాక్ చేస్తుంది, ఇది యుఎస్‌బి-సి కలిగి 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. రెడ్మి కె 30 ప్రో లో లీనియర్ మోటారుతో నడిచే మెరుగైన హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ సిస్టమ్ ఉందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌ లో IP 53 రేటింగ్ కూడా ఉంది, ఇది కొంతవరకు నీటి నిరోధకతను కలిగిస్తుంది.

షావోమి రెడ్మి కె 30 ప్రో మూడు వేరియంట్లలో వస్తుంది: 6GB + 128GB, 8GB + 128GB మరియు 8GB + 256GB : ఇది వరుసగా 2999 యువాన్ (~ 32,300), 3399 యువాన్ (~ 36,600) మరియు 3699 యువాన్ (~ 39,800) ధరలతో ఉంటుంది. రెడ్మి కె 30 ప్రో జూమ్ ఎడిషన్ 8 జిబి + 128 జిబి మరియు 8 జిబి + 256 జిబి మోడళ్లలో వరుసగా 3799 యువాన్ (~ 40,900) మరియు 3999 యువాన్ (~ 43,000) ధరలతో తీసుకురాబడింది.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo