REDMI K 30 స్మార్ట్ ఫోన్ డ్యూయల్ సెల్ఫీ కెమేరా, పంచ్ హోల్ డిస్ప్లే , 5G సపోర్ట్ మరెన్నో ప్రత్యేకతలతో రానుంది

HIGHLIGHTS

అత్యంత సరసమైన 5 జి ఫోన్

REDMI K 30 స్మార్ట్ ఫోన్ డ్యూయల్ సెల్ఫీ కెమేరా, పంచ్ హోల్ డిస్ప్లే , 5G సపోర్ట్ మరెన్నో ప్రత్యేకతలతో రానుంది

అతిత్వరలో, రెడ్మి తన REDMI K 30 స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్లోకి తీసుకుకురావడానికి పనిచేస్తున్నట్లు ధృవీకరించింది మరియు ఇప్పుడు దాని గురించి మరికొన్ని వివరాలను వెల్లడించింది. కంపెనీ, ఈ హ్యాండ్‌సెట్ ని ఒక 5 జి సపోర్ట్‌తో తీసుకురానున్నట్లు గతంలో కంపెనీ GM లూ వైబింగ్  ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే,  ఇప్పుడు ఈ రెడ్మి కె 30 డ్యూయల్ ఫ్రంట్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని కూడా ఆయన ధృవీకరించారు, ఇది డిస్ప్లేలో పంచ్-హోల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది . కంపెనీ ఎగ్జిక్యూటివ్ కూడా ఈ ఫోన్ డిజైనును పాక్షికంగా వెల్లడించారు మరియు ఇది శామ్సంగ్ గెలాక్సీ నోట్ ఎస్ 10 + కు సమానంగా కనిపిస్తుంది, ఇది డ్యూయల్ ఫ్రంట్ కెమెరాల కోసం పంచ్-హోల్ డిస్ప్లే డిజైన్‌ను కూడా కలిగి ఉంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

వీబింగ్ ఈ సమాచాదాన్ని వెయిబోలో పంచుకున్నారు మరియు  Redmi K30 లో 5G మద్దతును పునరుద్ఘాటించారు. విల్ ఎస్‌ఐ (స్టాండలోన్ మోడ్) మరియు ఎన్‌ఎస్‌ఏ (నాన్-స్టాండలోన్ మోడ్) డ్యూయల్ మోడ్ సపోర్ట్‌తో వచ్చే పరికరం గురించి కొన్ని అదనపు వివరాలను ఆయన ఇప్పుడు పంచుకున్నారు. సెల్ టవర్లు మరియు సర్వర్‌ల మధ్య కమ్యూనికేషన్ వంటి నియంత్రణ విధుల కోసం రెండోది ప్రస్తుతమున్న LTE నెట్‌వర్క్‌పై ఆధారపడుతుంది. ఇది ఇప్పటికే LTE కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో 5G విస్తరణ ఖర్చులను తగ్గించటానికి వీలు కల్పిస్తుంది. అదనంగా, K30 ని మార్కెట్లోకి తీసుకొచ్చినప్పుడు అది “అత్యంత సరసమైన 5 జి ఫోన్” గా అవతరిస్తుందని అన్నారు.

రెడ్మి కె 30, రెడ్మి కె 20 యొక్క తరువాతి త్రం ఫోనుగా రావచ్చు మరియు రెడ్మి కె 30 ప్రో కూడా తీసుకోవచ్చని మేము అంచానావేస్తున్నాము. రెడ్మి కె 20 మరియు రెడ్మి కె 20 ప్రో కూడా స్పెసిఫికేషన్ల పరంగా చాలా పోలికలను  కలిగి ఉంటాయి. రెండు ఫోన్లలో 1080x2340p రిజల్యూషన్‌ కలిగిన ఒక 6.39-అంగుళాల ఫుల్ హెచ్‌డి + డిస్ప్లే ఉంటుంది మరియు ఆండ్రాయిడ్ 9 పై ఆధారంగా MIUI 10 పై నడుస్తుంది. 4000 ఎంఏహెచ్ బ్యాటరీతో మద్దతు ఉన్న ఈ రెండు ఫోన్లలో 20 MP ఫ్రంట్ కెమెరా అమర్చారు, ఇది వారి పాప్-అప్ ఫ్రంట్ కెమెరా సెటప్‌లో ఉంది.

రెడ్మి కె 20 ప్రో ఒక స్నాప్‌డ్రాగన్ 855 SoC తో నడుస్తుంది మరియు 8GB RAM వరకు మరియు 256GB వరకు అంతర్గత స్టోరేజితో వస్తుంది. మరోవైపు, రెడ్మి కె 20 స్నాప్‌డ్రాగన్ 730 SoC తో పనిచేస్తుంది, ఇది 6 జిబి ర్యామ్‌తో జత చేయబడింది మరియు 64 జిబి మరియు 128 జిబి ఆన్‌బోర్డ్ స్టోరేజ్ నుండి ఎంచుకునే ఎంపికలతో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo