Redmi 9 Power : తక్కువ ధరకే ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చింది

Redmi 9 Power : తక్కువ ధరకే ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చింది
HIGHLIGHTS

షియోమి తన Redmi 9 Power స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది.

9 పవర్ అతిపెద్ద బ్యాటరీతో లాంచ్

రెడ్‌మి 9 పవర్ స్మార్ట్ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది.

భారతదేశంలో షియోమి తన Redmi 9 Power  స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. ఈ 9 పవర్  స్మార్ట్ ఫోన్ను అతిపెద్ద బ్యాటరీ, మంచి క్వాడ్ కెమెరాతో మరియు కొత్త వేగవంతమైన ప్రొసెసర్ తో పాటుగా మరికొన్ని ట్రెండీ ఫీచర్లతో లాంచ్ చేసింది. అన్ని ప్రధాన ఫీచర్ల మేళవింపుగా అందించిన ఈ స్మార్ట్ ఫోన్ను బడ్జెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకోని విడుదల చేసింది.

Redmi 9 Power : ధర

రెడ్‌మి 9 పవర్ స్మార్ట్ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది.

రెడ్‌మి 9 పవర్ (4GB ర్యామ్ + 64GB స్టోరేజ్) – Rs.10,999

రెడ్‌మి 9 పవర్ (4GB ర్యామ్ + 128GB స్టోరేజ్) – Rs.11,999

రెడ్‌మి 9 పవర్, బ్లేజింగ్ బ్లూ, ఎలక్ట్రిక్ గ్రీన్, ఫియరీ రెడ్ మరియు మైటీ బ్లాక్ అనే నాలుగు కలర్ అప్షన్లతో లభిస్తుంది.

 Redmi 9 Power : స్పెషిఫికేషన్లు

రెడ్‌మి 9 పవర్ స్మార్ట్ ఫోన్ పెద్ద 6.53 ఇంచ్ ఫుల్ HD+ రిజల్యూషన్ గల డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే గరిష్టంగా 400 నిట్స్  బ్రైట్నెస్ అందించగలదు  మరియు ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో వుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 662 SoC తో పనిచేస్తుంది. ఇది 2.0 GHz క్లాక్ స్పీడ్ గల ఆక్టా కోర్ ప్రొసెసర్ మరియు అడ్రినో 610 GPU తో వుంటుంది. ఈ ప్రోసిజర్ కి జతగా 4GB LPDDR4 (2.1) ర్యామ్ మరియు 128 GB స్టోరేజ్ మద్దతును కలిగి ఉంటుంది. డేడికేటెడ్ మెమొరీ కార్డుతో మెమోరిని మరింతగా పెంచుకోవచ్చు.   

ఇక కెమెరా విభాగానికి వస్తే, 9 పవర్ వెనుక క్వాడ్ కెమెరా సెటప్పును కలిగివుంది. ఇందులో, 48MP ప్రధాన కెమెరా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్  కెమెరాకి జతగా 2MP మ్యాక్రో మరియు 2MP డెప్త్ సెన్సార్ లను కలిగివుంటుంది. ముందుభాగంలో, సెల్ఫీల కోసం 8MP సెల్ఫీ కెమెరాని అందించారు. ఈ ఫోన్, అన్లాక్ ఫీచర్లుగా ఫేస్ అన్లాక్ మరియు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కలివుంది. ఆడియో పరంగా, Hi-Res స్పీకర్లను ఇంద్న్హులో అందించినట్లు షియోమీ తెలిపింది.   

ఇక ఈ స్మార్ట్ ఫోన్ పేరుకు తగ్గట్టుగానే పవర్ ఫుల్ బ్యాటరీని కలిగి వుంది. ఈ 9 పవర్ ఫోన్, అతిపెద్ద 6,000 mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో కలిగి వుంటుంది. అయితే, బాక్సులో మాత్రం 22.5 W ఫాస్ట్ చార్జర్ ను బాక్సుతో పాటుగా ఇస్తునట్లు కంపెనీ తెలిపింది.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo