REDMI 7 మరియు REDMI Y3 ఫ్లాష్ సేల్ మరొకసారి
ఫ్లాష్ సేల్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి అమేజాన్, mi.com మరియు మి హోమ్ నుండి జరగనుంది.
రెడ్మి 7 ( 2GB + 32GB ) ధర : Rs. 7,999
రెడ్మి Y3 ( 3GB + 32GB ) ధర : Rs. 9,999
షావోమి, ఇటీవల మంచి స్పెక్స్ మరియు గొప్ప కెమెరాలతో కేవలం బడ్జెట్ ధరలో తీసుకొచ్చినటువంటి REDMI 7 మరియు REDMI Y3 ఫ్లాష్ సేల్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి మరొకసారి జరగనుంది. షావోమి ఇండియాలో 32MP సెల్ఫీ కెమేరా మరియు తక్కువ ధరలో స్నాప్ డ్రాగన్ 632 ప్రాసెసర్ తో తీసుకొచ్చిన, రెడ్మి Y3 మరియు రెడ్మి 7 యొక్క ఈ ఫ్లాష్ సేల్ ఈ రోజు మధ్యాహ్నం జరగనుంది. అయితే, రెడ్మి 7 సేల్ మధ్యాహ్నం 12 గంటలకి మొదలవుతుండగా, రెడ్మి Y3 సేల్ మాత్రం మధ్యాహ్నం 3 గంటలకి మొదలవనుంది. ఈ సేల్, అమేజాన్, mi.com మరియు మి హోమ్ నుండి జరగనుంది. అమేజాన్, mi.com మరియు మి హోమ్ నుండి జరగనుంది. ఇక్కడ ఇచ్చిన Link పైన నొక్కడం ద్వారా నేరుగా కొనవచ్చు.
Surveyషావోమి రెడ్మి 7 ధరలు
రెడ్మి 7 ( 2GB + 32GB ) ధర : Rs. 7,999 ( LINK )
రెడ్మి 7 ( 3GB + 32GB ) ధర : Rs. 8,999 ( LINK )
షావోమి రెడ్మి Y3 ధరలు
రెడ్మి Y3 ( 3GB + 32GB ) ధర : Rs. 9,999 ( LINK )
రెడ్మి Y3 ( 4GB + 64GB ) ధర : Rs. 11,999 ( LINK )
షావోమి రెడ్మి Y3 ప్రత్యేకతలు
షావోమి రెడ్మి Y3 స్మార్ట్ ఫోన్, HD+ రిజల్యూషన్ అందించగల ఒక 6.26 అంగుళాల డాట్ నోచ్ డిస్ప్లేతో అందించబడింది. అలాగే, ఇందులో అందించిన లో బ్లూ లైట్ టెక్నలాజితో రాత్రి సమయాల్లో కళ్ళకు ఇబ్బంది లేకుండా చేస్తుందని కంపెనీ చెబుతుంది. అధనంగా, ఈ స్క్రీన్ ఒక గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వస్తుంది. ఇది ఒక క్వాల్కమ్ స్నాప్డ్ డ్రాగన్ 632 ఆక్టా కోర్ ప్రొసెసరు శక్తితో నడుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక భారీ 4000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 3GB ర్యామ్ జతగా 32GB స్టోరేజితో వస్తుంది. అధనంగా, ఒక SD కార్డు ద్వారా 512GB స్టోరేజిని పెంచుకునే సామర్ధ్యంతో వస్తుంది. ఇది ప్రిజం బ్లూ, ప్రైమ్ బ్లాక్ మరియు బోల్డ్ రెడ్ వంటి కలర్ ఎంపికలతో ఎంచుకునేలా లభిస్తుంది.
ఇక కెమెరా విభగానికి వస్తే, ఇది వెనుక భాగంలో 12MP + 2MP డ్యూయల్ రియర్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఇందులో 12MP ప్రధాన కెమరా మరియు 2MP పోర్ట్రైట్ షాట్లకోసం ఉపయోగపడుతుంది. ఇక ముందుభాగంలో సెల్ఫీల కోసం 32MP కెమెరాని అందించారు. సెల్ఫీలను క్లిక్ చేయడంతో పాటుగా HDR తో వీడియోలను తీసుకునే సామర్ధ్యంతో వస్తుంది. ఇందులో అందించిన సెల్ఫీల కెమేరాతో మంచి ఫోటోలను క్లిక్ చెయ్యవచు.
షావోమి రెడ్మి 7 ప్రత్యేకతలు
షావోమి రెడ్మి 7 స్మార్ట్ ఫోన్, HD+ రిజల్యూషన్ అందించగల ఒక 6.26 అంగుళాల డాట్ నోచ్ డిస్ప్లేతో అందించబడింది. ఈ ఫోన్ ఒక 19:9 ఆస్పెక్ట్ రేషియాతో వస్తుంది మరియు ఒక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో దీని స్క్రీన్ ప్రొటెక్ట్ చెయ్యబడింది. ఇది ఒక క్వాల్కమ్ స్నాప్డ్ డ్రాగన్ 632 ఆక్టా కోర్ ప్రొసెసరు శక్తితో నడుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక భారీ 4000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 2GB ర్యామ్ జతగా 32GB స్టోరేజితో వస్తుంది. అధనంగా, ఒక SD కార్డు ద్వారా 512GB స్టోరేజిని పెంచుకునే సామర్ధ్యంతో వస్తుంది. ఇది కమెట్ బ్లూ, ఎక్లిప్స్ బ్లాక్ మరియు లూనార్ రెడ్ వంటి కలర్ ఎంపికలతో ఎంచుకునేలా లభిస్తుంది.
ఇక కెమెరావిభగానికి వస్తే, ఇది వెనుక భాగంలో 12MP + 2MP డ్యూయల్ రియర్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఇందులో 12MP ప్రధాన కెమరా మరియు 2MP పోర్ట్రైట్ షాట్లకోసం ఉపయోగపడుతుంది. ఇక ముందుభాగంలో సెల్ఫీల కోసం ఒక 8MP AI కెమెరాని అందించారు. ఇందులో సెల్ఫీలను క్లిక్ చేయడం పామ్ షట్టర్ అనే కొత్త ఫీచరుతో వస్తుంది. అధనంగా, ఈ స్మార్ట్ ఫోన్ ఒక Pi2 టెక్నలాజితో వస్తుంది కాబట్టి, నీటి తుంపరలు మరియు హ్యుమిడిటీ నుండి రాకాశానను ఇసుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
