Redmi 15A : బిగ్ స్క్రీన్ తో షియోమీ బడ్జెట్ ఫోన్ లాంచ్ కోసం సిద్ధం.!
షియోమీ అప్ కమింగ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ రెడ్ మీ 15a లాంచ్ డేట్ లో కన్ఫర్మ్ చేసింది
Redmi 15A ను బిగ్ స్క్రీన్ మరియు మంచి డిజైన్ తో లాంచ్ చేస్తోంది
6.9 ఇంచ్ బిగ్ స్క్రీన్ తో లాంచ్ చేస్తున్నట్లు రెడ్ మీ ప్రకటించింది
Redmi 15A : షియోమీ అప్ కమింగ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ రెడ్ మీ 15a లాంచ్ డేట్ లో కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ ను బిగ్ స్క్రీన్ మరియు మంచి డిజైన్ తో లాంచ్ చేస్తోంది. రెడ్ మీ నెంబర్ సిరీస్ నుంచి రాబోతున్న ఈ అప్ కమింగ్ బడ్జెట్ స్మార్ట్ లాంచ్ డేట్ మరియు ఈ ఫోన్ ఫీచర్స్ ఏమిటో చూద్దామా.
SurveyRedmi 15A : లాంచ్ డేట్
రెడ్ మీ 15a స్మార్ట్ ఫోన్ మార్చి 27వ ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన కంపెనీ ఈ ఫోన్ ఫీచర్స్ కూడా వెల్లడించింది.
Redmi 15A : ఫీచర్స్
రెడ్ మీ 15a స్మార్ట్ ఫోన్ ను 6.9 ఇంచ్ బిగ్ స్క్రీన్ తో లాంచ్ చేస్తున్నట్లు రెడ్మీ ప్రకటించింది. ఈ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ కోసం తగిన పార్ట్నర్ అవుతుందని రెడ్ మీ చెబుతోంది. ఈ ఫోన్ మంచి స్లీక్ డిజైన్ లో ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ ఇంకా బయటకు వెల్లడించలేదు. అయితే, ఈ ఫోన్ స్పెక్స్ నెట్టింట్లో లీక అయ్యాయి.
Also Read: Realme P4 Lite 5G: సింగల్ డే బిగ్ డీల్స్ తో ఫస్ట్ సేల్ రేపు జరుగుతుంది.!
రెడ్ మీ 15a లీక్డ్ స్పెక్స్
రెడ్ మీ 15a స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.9 ఇంచ్ స్క్రీన్ తో లాంచ్ అవుతుంది. ఇది HD+ రిజల్యూషన్ మరియు మంచి బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Unisoc T8300 చిప్ సెట్ తో లాంచ్ చేస్తుందని లీక్స్ చెబుతున్నాయి. అంతేకాదు, ఈ ఫోన్ లో 4GB ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ అందించే అవకాశం ఉందని కూడా లీక్స్ చెబుతున్నాయి. ఈ ఫోన్ హైపర్ OS 3 జతగా ఆండ్రాయిడ్ 16 OS తో వస్తుంది.
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కెమెరా వివరాలు కూడా లీక్స్ చెబుతున్నాయి. ఈ ఫోన్ లో 32MP మెయిన్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ 6300mAh భారీ బ్యాటరీ తో లాంచ్ అయ్యే అవకాశం ఉందని కూడా లీక్స్ చెబుతున్నాయి. అంతేకాదు, ఈ ఫోన్ 15W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉందని కూడా ఇదే లీక్స్ వెల్లడించాయి.
ఓవరాల్ గా ఈ ఫోన్ ఎంట్రీ లెవల్ 5జి ఎంటర్టైన్మెంట్ ఫోన్ గా ఇండియన్ మార్కెట్ లో అడుగు పెట్టె అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ 10 వేల రూపాయల బడ్జెట్ లో రావచ్చని అంచనా వేసున్నారు.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile