Realme P4 Lite 5G: సింగల్ డే బిగ్ డీల్స్ తో ఫస్ట్ సేల్ రేపు జరుగుతుంది.!
Realme P4 Lite 5G ఫస్ట్ సేల్ రేపు 12 గంటలకు మొదలవుతుంది
12 గంటలు మాత్రమే అందుబాటులో ఉండే లాంచ్ ఆఫర్స్ తో సేల్ అవుతుంది
ఫస్ట్ నుంచి ఈ ఫోన్ ను మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో తక్కువ ధరలో అందుకోవచ్చు
Realme P4 Lite 5G: భారీ 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో రియల్ మీ లేటెస్ట్ గా విడుదల చేసిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ రియల్ మీ పి 4 లైట్ ఫస్ట్ సేల్ రేపు 12 గంటలకు మొదలవుతుంది. అయితే, రేపు జరిగే సేల్ కి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే, ఈ ఫోన్ 12 గంటలు మాత్రమే అందుబాటులో ఉండే లాంచ్ ఆఫర్స్ తో సేల్ అవుతుంది. అంటే, రేపు జరిగే ఈ ఫోన్ ఫస్ట్ నుంచి ఈ ఫోన్ ను మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో తక్కువ ధరలో అందుకోవచ్చు.
SurveyRealme P4 Lite 5G : ప్రైస్ అండ్ ఆఫర్స్
రియల్‌మీ పి4 లైట్ స్మార్ట్ ఫోన్ మొత్తం మూడు ర్యామ్ అండ్ స్టోరేజ్ ఆప్షన్ తో లాంచ్ అయ్యింది. ఇందులో స్టార్టింగ్ (4GB + 64GB) వేరియంట్ రూ. 12,999 ధరతో, మిడ్ (4GB + 128GB) వేరియంట్ రూ. 13,999 ధరతో మరియు హై ఎండ్ (6GB + 128GB) వేరియంట్ రూ. 15,999 ధరతో లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్ మొసాయిక్ గ్రీన్ మరియు మొసాయిక్ బ్లూ రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

ఇక ఆఫర్స్ విషయానికి వస్తే, ఫస్ట్ డే సేల్ నుంచి ఈ ఫోన్ పై రూ. 1,000 రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను జత చేసింది. ఈ రెండు డిస్కౌంట్ ఆఫర్స్ తో కేవలం రూ. 11,499 రూపాయల స్టార్టింగ్ ధరలో ఈ ఫోన్ లభిస్తుంది. అయితే, ఈ ఆఫర్ కేవలం రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి 11:59 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్డ్ మరియు రియల్ మీ అఫీషియల్ సైట్ నుంచి సేల్ అవుతుంది.
Also Read: OnePlus Nord 6 పవర్ ఫుల్ ట్రిపుల్ చిప్ సెట్ తో లాంచ్ అవుతోంది.!
Realme P4 Lite 5G : ఫీచర్స్
రియల్‌మీ ఈ బడ్జెట్ ఫోన్ ను 6.8 ఇంచ్ బిగ్ LCD స్క్రీన్ తో అందించింది. అంతేకాదు, ఈప్రైస్ సెగ్మెంట్ లో ఎన్నడూ లేని విధంగా 144Hz రిఫ్రెష్ రేట్ తో ఈ ఫోన్ ను అందించింది. ఈ ఫోన్ 900 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు HD+ రిజల్యూషన్ తో వస్తుంది.
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో ఎక్కువ లాంచ్ అయిన ఫోన్ల మాదిరిగానే ఈ ఫోన్ కూడా మీడియాటెక్ బడ్జెట్ 5జి చిప్ సెట్ Dimensity 6300 తో వచ్చింది. ఈ ఫోన్ లో 6 జీబీ ఫిజికల్ ర్యామ్ మరియు 8 జీబీ అదనపు ర్యామ్ సపోర్ట్ కూడా అందించింది. దీనితో ఈ ఫోన్ 14GB ర్యామ్ ఫీచర్ మరియు 128 జీబీ స్టోరేజ్ తో కలిగి ఉంటుంది.
13MP AI డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 5MP సెల్ఫీ కెమెరాతో ఈ ఫోన్ వస్తుంది. ఇది బడ్జెట్ ఫోన్ అయినా కూడా AI ఎరేజర్ 2.0 వంటి చాలా లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ ఈ ఫోన్ కలిగి ఉంటుంది. Realme UI 7.0 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 16 OS జతగా ఈ ఫోన్ వస్తుంది.
ఈ ఫోన్ బడ్జెట్ ధరలో వచ్చినా ఈ ఫోన్ ను 7000 mAh భారీ టైటాన్ బ్యాటరీతో అందించింది. ఇది చాలా ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ లో ప్రీమియం ఫోన్స్ లో ఉండే బైపాస్ ఛార్జ్ సపోర్ట్ మరియు రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా అందించింది. ఈ ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కలిగి ఉంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile