OnePlus Nord 6 పవర్ ఫుల్ ట్రిపుల్ చిప్ సెట్ తో లాంచ్ అవుతోంది.!
OnePlus Nord 6 లాంచ్ డేట్ ను ఈరోజు వన్ ప్లస్ అధికారికంగా అనౌన్స్ చేసింది
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు కీలకమైన ఫీచర్లను కూడా ఈరోజు వన్ ప్లస్ రివిల్ చేసింది
పవర్ ఫుల్ చిప్ సెట్ శక్తితో లాంచ్ చేయబోతున్నట్లు వన్ ప్లస్ గొప్ప గా చెబుతోంది
OnePlus Nord 6 లాంచ్ డేట్ ను ఈరోజు వన్ ప్లస్ అధికారికంగా అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు కీలకమైన ఫీచర్లను కూడా ఈరోజు వన్ ప్లస్ రివిల్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను పవర్ ఫుల్ చిప్ సెట్ శక్తితో లాంచ్ చేయబోతున్నట్లు వన్ ప్లస్ గొప్ప గా చెబుతోంది.
SurveyOnePlus Nord 6 : లాంచ్
వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ నార్డ్ 6 ను ఏప్రిల్ 7వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది.
OnePlus Nord 6 : కీలక ఫీచర్స్
వన్ ప్లస్ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్లు టీజర్ ద్వారా బయటకు వెల్లడించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ట్రిపుల్ చిప్స్ సెట్ పవర్ తో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ గొప్పగా తెలిపింది. ఇందులో ఫోన్ ను నడిపించే క్వాల్కమ్ పవర్ ఫుల్ చిప్ సెట్ Snapdragon 8s Gen 4, టచ్ రిఫ్లెక్స్ చిప్ మరియు G2 Wi-Fi చిప్ ఉన్నాయి.

ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8s Gen 4 చిప్స్ సెట్ తో జతగా 12GB LPDDR5x ఫాస్ట్ ర్యామ్ మరియు 256GB UFS 4.1 ఫాస్ట్ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఈ ఫోన్ కలిగిన చిప్సెట్ మరియు రామ్ సపోర్టుతో పిక్ పెర్ఫార్మెన్స్ అందిస్తుందని వన్ ప్లస్ గొప్పగా చెబుతోంది.
అంతేకాదు ఈ ఫోన్ కలిగిన ప్రత్యేకమైన వైఫై చిప్ తో వేగవంతమైన నెట్వర్క్ మరియు టచ్ రిఫ్లెక్స్ చిప్ తో గొప్ప గేమింగ్ ఎక్స్ పీరియన్స్ ఆఫర్ చేస్తుందని కూడా వన్ ప్లస్ చెబుతోంది. అందుకే, ఈ ఫోన్ లో అల్ట్రా స్మూత్ గేమింగ్ కోసం 165 FPS గేమింగ్ కోసం తగిన గొప్ప స్క్రీన్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 165Hz రిఫ్రెష్ రేట్ OLED స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ కనిష్టంగా 2 నిట్స్ బ్రైట్నెస్ మొదలుకొని 1800 నిట్స్ వరకు గొప్ప బ్రైట్నెస్ కలిగి ఉంటుంది.
Also Read: Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై మరోసారి భారీ డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్.!
బ్యాటరీ విభాగంలో కూడా ఈ ఫోన్ గొప్ప సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను 9000 mAh భారీ బ్యాటరీ తో లాంచ్ చేస్తున్నట్లు వన్ ప్లస్ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ కలిగిన భారీ బ్యాటరీ తో ఏకంగా 26 గంటలు యూట్యూబ్ వీడియోలు చూడొచ్చని వన్ ప్లస్ పేర్కొంది. ఈ ఫోన్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లి వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉన్నట్లు కనిపిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ బిగ్ బ్యాటరీ కలిగి ఉన్నా కూడా చాలా స్లీక్ డిజైన్ తో ఉన్నట్లు టీజర్ ఇమేజ్ ద్వారా అర్థం అవుతుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile