Redmi కొత్త బడ్జెట్ ఫోన్ రింగ్ ఫ్లాష్ 108MP కెమెరాతో రేపు లాంచ్ అవుతుంది.!

HIGHLIGHTS

Redmi కొత్త బడ్జెట్ ఫోన్ 108MP కెమెరాతో రేపు లాంచ్ అవుతుంది

రెడ్ మీ 13 5జి ఫోన్ ను రింగ్ ఫ్లాష్ 108MP కెమెరాతో రేపు లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించింది

ఈ ఫోన్ తో పాటు రెడ్ మీ బడ్స్ 5C ఇయర్ బడ్స్ ను కూడా లాంచ్ చేస్తోంది

Redmi కొత్త బడ్జెట్ ఫోన్ 108MP కెమెరాతో రేపు లాంచ్ అవుతుంది. ఏ ఫోన్ గురించి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా?, రెడ్ మీ 13 5జి స్మార్ట్ ఫోన్ గురించే మనం మాట్లాడుకుంటోంది. రెడ్ మీ ఈ కొత్త బడ్జెట్ ఫోన్ ను రింగ్ ఫ్లాష్ 108MP కెమెరాతో రేపు లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఫోన్, రెడ్ మీ 13 సిరీస్ నుంచి వస్తున్న కొత్త ఫోన్ మరియు బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అవుతుంది.

Redmi 13 5G: లాంచ్

Redmi 13 5G

రెడ్ మీ ఈ ఫోన్ ను రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో విడుదల చేస్తుంది. ఈ ఫోన్ లాంచ్ తర్వాత అమెజాన్ ఇండియా మరియు mi.com నుండి సేల్ అవుతుంది. ఈ ఫోన్ తో పాటు రెడ్ మీ బడ్స్ 5C ఇయర్ బడ్స్ ను కూడా లాంచ్ చేస్తోంది.

Redmi 13 5G: ఫీచర్లు

రెడ్ మీ 13 5జి స్మార్ట్ ఫోన్ ను రింగ్ ఫ్లాష్ కలిగిన 108MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో లాంచ్ చేస్తునట్టు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్ సెట్ ఉన్నట్లు రెడ్ మీ తెలిపింది. ఇది బడ్జెట్ ప్రోసెసర్ మరియు మల్టీ టాస్కింగ్ కు సరిపోయేలా ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ షియోమీ లేటెస్ట్ గా తీసుకొచ్చిన Xiaomi Hyper OS తో పని చేస్తుందని కూడా రెడ్ మీ తెలిపింది.

Also Read: Aadhaar Card: మీ ఆధార్ హిస్టరీ అప్పుడప్పుడు చెక్ చేసుకోండి..ఎందుకంటే.!

ఈ ఫోన్ లో పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా సెటప్ మరియు గొరిల్లా గ్లాస్ 3 రక్షణ కలిగిన పెద్ద డిస్ప్లే ఉందని కంపెనీ తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ లో 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5030 mAh బిగ్ బ్యాటరీ ఉన్నట్లు కూడా రెడ్ మీ తెలిపింది. ఈ ఫోన్ మూడు కలర్ వేరియంట్లలో లభిస్తుందని కూడా రెడ్ మీ తెలిపింది. ఈ ఫోన్ లో ముందు మరియు వెనుక కూడా గ్లాస్ డిజైన్ వుంది.

ఇక ఈ ఫోన్ తో పాటు విడుదల చేస్తున్న రెడ్ మీ బడ్స్ 5C ఇయర్ బడ్స్ విషయానికి వస్తే, ఈ బడ్స్ ను ఎక్కువ కాలం నిలిచి ఉండే బ్యాటరీ, ప్రీమియం సౌండ్ అందించే స్పీకర్ మరియు నోయిస్ లేకుండా వుండే సర్దుబాటు ఇందులో ఉన్నట్లు తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :