Redmi 10A : బడ్జెట్ ధరలో వచ్చిన బిగ్ బ్యాటరీ ఫోన్..!

HIGHLIGHTS

Xiaomi తన సరికొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది.

ఆకర్షణీయమైన ఫీచర్లతో Redmi 10A ను మార్కెట్లో విడుదల చేసింది

10 వేల రూపాయల బడ్జెట్ కేటగిరిలో ప్రకటించింది

Redmi 10A : బడ్జెట్ ధరలో వచ్చిన బిగ్ బ్యాటరీ ఫోన్..!

Xiaomi తన సరికొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. అవే Redmi 10A మరియు 10 Power స్మార్ట్ ఫోన్లు. వీటిలో, రెడ్‌మి 10ఎ స్మార్ట్ ఫోన్ ను కేవలం 10 వేల రూపాయల బడ్జెట్ కేటగిరిలో ప్రకటించింది. కానీ, వేగవంతమైన Helio G25 చిప్‌సెట్, 5000 mAh బిగ్ బ్యాటరీ, ఎక్స్ టెండేడ్ ర్యామ్ ఫీచర్ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ ఫోన్ ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ రెండు ర్యామ్ వేరియంట్లలో లభిస్తుంది. షియోమీ యొక్క ఈ కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ గురించి వివరంగా చూద్దాం పదండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Redmi 10A : ధర

షియోమి రెడ్‌మి 10ఎ బేసిక్ వేరియంట్ 3 జిబి + 32 జిబి వేరియంట్‌ ధర రూ .8,499 మరియు 4 జిబి + 64 జిబి వేరియంట్‌ ధర రూ .9,499 రూపాయలుగా ప్రకటించింది. ఏప్రిల్ 26 నుండి అమెజాన్ మరియు mi స్టోర్ నుండి  ఈ ఫోన్ అమ్మకానికి వస్తుంది.  

Redmi 10A: స్పెక్స్

షియోమి రెడ్‌మి 10ఎ ఒక 6.53-అంగుళాల HD + (1600 x 720 పిక్సెల్స్) రిజల్యూషన్ గల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ప్లేలో సెల్ఫీ కెమెరా కోసం వాటర్‌డ్రాప్ నాచ్ కటౌట్‌తో ఉంటుంది. Redmi 10A ఫోన్ స్క్రీన్‌ మీకు అత్యధికంగా 400 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ మరియు 20: 9 ఎస్పెక్ట్ రేషియోని ఇస్తుంది. ఇది 9 మిల్లీమీటర్ల మందం మరియు 194 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. రెడ్‌మి 10A చార్కోల్ బ్లాక్, సీ బ్లూ మరియు స్లేట్ గ్రీన్ అనే మూడు రంగులలో లభిస్తుంది.

Redmi 10A(1).jpg

Redmi 10A మీడియా టెక్ హెలియో జి 25 ప్రాసెసర్ కి జతగా 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ ఆప్షన్లతో జతచేయబడుతుంది. అదనంగా, 1జీబీ RAM బూస్ట్ టెక్నాలజీతో కూడా వస్తుంది. ఇది మైక్రో SD కార్డ్ ద్వారా 512GB వరకు మెమరీ విస్తరణకు మద్దతు ఇస్తుంది. ఇది MIUI 12.5 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 11 OS పైన నడుస్తుంది.

రెడ్‌మి 10ఎ లో వెనుక క్వాడ్ కెమెరా అనిపించేలా సెటప్ వున్నా కూడా 13 ఎంపి కెమెరా సింగల్ కెమెరాని మాత్రమే అందించింది. ముందు నాచ్ కటౌట్‌లో 5MP సెల్ఫీ కెమెరా వుంది. ఇది ప్రాథమిక సెన్సార్లు మరియు కనెక్టివిటీ లక్షణాలతో Wi-Fi మరియు బ్లూటూత్ 5.0 తో వస్తుంది. షియోమి రెడ్‌మి 10A లో 5,000 mAh  బ్యాటరీ 10W రెగ్యులర్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo