రియల్మీ X2 vs రియల్మీ XT : కంప్లీట్ కంపారిజన్

రియల్మీ X2 vs రియల్మీ XT : కంప్లీట్ కంపారిజన్
HIGHLIGHTS

ఈ రెండు స్మార్ట్ ఫోన్ల యొక్క పూర్తి స్పెషిఫికేషన్లను సరిపోల్చనున్నాము

ఈరోజు రియల్మీ సంస్థ ఇండియాలో తన రియల్మీ X2 సామ్రాట్ ఫోన్ను లాంచ్ చేసింది. అయితే, ఈ రియల్మీ X2 స్మార్ట్ ఫోన్ ముందుగా రియల్మీ ఇండియాలో విడుదల చేసినటువంటి, రియల్మీ XT యొక్క స్పెషిఫికేషన్లలను కలిగివుంటుంది. అయితే, ప్రాసెసర్, సెల్ఫీ కెమేరా, బ్యాటరీ ఛార్జింగ్ టెక్నాలజీ మరియు కొన్ని ఇతర మార్పులను మాత్రం చేసిందని చెప్పొచ్చు. అందుకోసమే, ఈ రెండు స్మార్ట్ ఫోన్ల యొక్క పూర్తి స్పెషిఫికేషన్లను సరిపోల్చి ఈ ధరలో మనము ఎటువంటి వివరాలను అందుకోనున్నాం, అనే విషయాన్ని తెలుసుకుందాం.

Price :  

Realme XT ధరలు

1. Realme XT  (4GB + 64GB) ధర – Rs.15,999

2. Realme XT (6GB + 64GB) ధర – Rs.16,999

3. Realme XT (8GB + 128GB) ధర – Rs.18,999

Realme X2 ధరలు

1. Realme X2  (4GB + 64GB) ధర – Rs.16,999

2. Realme X2 (6GB + 128GB) ధర – Rs.18,999

3. Realme X2 (8GB + 128GB) ధర – Rs.19,999

డిస్ప్లే :

డిస్ప్లే విభాగంలో, ఈ రెండు స్మార్ట్ ఫోన్లు ఒకే విధంగా వుంటాయని చెప్పొచ్చు. ఎందుకంటే, ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా 6.4 అంగుళాలు పరిమాణం కలిగి ఉంటాయి. అలాగే, ఈ డిస్ప్లే ఒక 2340×1080 పిక్సెల్స్ రిజల్యూషన్, అంటే FHD+  అందించగల ఒక Super AMOLED డిస్ప్లేతో వస్తాయి. అంటే, ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా డిస్ప్లే పరంగా ఒకే విధంగా ఉంటాయి.

ప్రాసెసర్ :

ఈ రెండు స్మార్ట్ ఫోన్ల మధ్యగల ముఖ్యమైన వ్యత్యాసంగా, ఈ రెండింటి ప్రాసెసర్ల గురించి చెప్పొచ్చు. రియల్మీ XT ఒక 2.3 GHz వరకూ క్లాక్ స్పీడ్ అందించగల స్నాప్ డ్రాగన్ 712AIE ఆక్టా కోర్ ప్రాసెసర్ తో వస్తుంది. ఇక రియల్మీ X2 విషయానికి వస్తే, ఇది 2.2 GHz వరకూ క్లాక్ స్పీడ్ అందించగల స్నాప్ డ్రాగన్ 730G ఆక్టా కోర్ ప్రాసెసర్ తో వస్తుంది. అయితే, రియల్మీ XT ప్రాసెసర్ ఒక 10nm ఫ్యాబ్రికేషన్ తో వస్తే, రియల్మీ X2 ఒక 8nm ఫ్యాబ్రికేషన్ ప్రాసెసర్ తో వస్తుంది. ఇక GPU విషయానికి వస్తే, రియల్మీ XT ఒక 616 GPU తో వస్తే రియల్మీ X2 ఒక 618 GPU తో వస్తుంది. ఈ విభాగంలో చూస్తే, CPU మరౌయి GPU పరంగా రియల్మీ X2 బెటర్ మరియు గొప్ప పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

వెనుక కెమేరా :

ఇక ఈ విభాగంలో కూడా ఈ రెండు స్మార్ట్ ఫోన్లు ఒకేవిధమైన కెమేరా ప్రత్యేకతలను మరియు సెన్సర్లను కలిగి ఉంటాయి. రియల్మి XT మరియు రియల్మీ X2 వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ తో ఉంటుంది. ఇది f / 2.25 ఎపర్చరు లెన్స్ మరియు 119 డిగ్రీల ఫీల్డ్ వ్యూతో ఒక 8MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ కలిగి ఉంటుంది. దీనికి జతగా 64MP ప్రాధమిక సెన్సార్‌తో పాటు, F / 2.4 లెన్స్‌తో 2MP పోర్ట్రెయిట్ లెన్స్ మరియు f / 2.4 మాక్రో లెన్స్‌తో 2MP కెమెరా కూడా ఉన్నాయి.

సెల్ఫీ కెమెరా :

ఈ విభాగంలో మాత్రం ఏండింటి మధ్య చాలా వ్యత్యాసం వుంది. రియల్మీ XT ముందుభాగంలో ఒక 16MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అయితే, రియల్మీX2 మాత్రం ఒక 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. కాబట్టి, ఈ విభాగంలో కూడా రియల్మీ X2 మంచి పనితీరును కనబరుస్తుంది.

 బ్యాటరీ :

రియల్మీ XT ఒక 4000mAh బ్యాటరీ మరియు టైప్-సి పోర్ట్‌ను కలిగి ఉంది మరియు VOOC 3.0 ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ VOOC ఛార్జింగ్ 80 నిమిషాల్లో హ్యాండ్‌సెట్ బ్యాటరీని 100 శాతం నింపుతుంది. ఇక రియల్మీ X2 విషయానికి వస్తే, ఒక 4000mAh బ్యాటరీతో టైప్-సి పోర్ట్‌ను కలిగి ఉంది మరియు 30 వాట్స్  VOOC 4.0 ఛార్జింగ్‌ కు మద్దతు ఇస్తుంది. ఈ VOOC ఛార్జింగ్ 70 నిమిషాల్లో హ్యాండ్‌సెట్ బ్యాటరీని 100 శాతం నింపుతుంది.                         

OS & సెక్యూరిటీ:

ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 9 ఫై ఆధారితంగా Color OS 6.1 పైన నడుస్తాయి మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సారుతో వస్తాయి.  .  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo