ఇండియాలో Realme X2 Pro లాంచ్

ఇండియాలో Realme X2 Pro లాంచ్
HIGHLIGHTS

ఇది ఒక 4000mAh సామర్థ్యం గల బ్యాటరీని 50W VOOC ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నలాజితో తీసుకొచ్చింది.

తన మొట్టమొదటి ఫ్లాగ్‌ షిప్ మొబైల్ ఫోనుగా  REALME X 2 Pro ను రియల్మీ సంస్థ, ముందుగా చైనాలో లాంచ్ చేసింది. ఇప్పుడు కంపెనీ, ఈ మొబైల్ ఫోన్ను ఇండియా మార్కెట్లో లాంచ్ చేయడానికి నవంబరు 20 వ తేదిని ఖాయం చేసింది. ఇది చైనాలో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ ఫోనుగా లాంచ్ చేయబడినా కూడా ఇది కేవలం మిడ్-రేంజ్ విభాగంలో కంపెనీ విడుదల చేసిన మొట్టమొదటి మొబైల్ ఫోనుగా నిలచింది. ఈ ధర వద్ద, ఈ మొబైల్ ఫోన్ REDMI K 20 Pro కు చాలా కఠినమైన పోటీని ఇచ్చే సామర్థ్యాన్ని ఈ స్మార్ట్ ఫోన్  కలిగి ఉంది.

రియల్మి ఎక్స్ 2 ప్రో : ప్రత్యేకతలు

ఈ రియల్మీ ఎక్స్ 2 ప్రో  ఫోనులో  ఒక ప్రధాన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855+ చిప్‌ సెట్ ఇవ్వబడింది. ఇది కాకుండా, మీరు ఈ మొబైల్ ఫోనులోఒక 6.5-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లేను కూడా పొందుతారు. అంతేకాదు, ఈ డిస్ప్లేని FHD + రిజల్యూషన్‌తో అందించింది. ఈ మొబైల్ ఫోన్‌లో, మీరు వన్‌ప్లస్ 7 ప్రో, వన్‌ప్లస్ 7 టి మరియు వన్‌ప్లస్ 7 టి ప్రో మొబైల్ ఫోన్‌ల మాదిరిగానే 90 Hz రిఫ్రెష్ రేట్‌ స్క్రీన్‌ను అందుకుంటారు మరియు  ఇది లిక్విడ్ కూలింగ్ ఫీచర్‌తో వస్తుంది. ముఖ్యంగా, ఇది ఒక 4000mAh సామర్థ్యం గల బ్యాటరీని 50W VOOC ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నలాజితో తీసుకొచ్చింది.

కెమెరా మొదలైన వాటి గురించి మాట్లాడితే, ఈ మొబైల్ ఫోన్‌లో మీకు క్వాడ్-కెమెరా సెటప్ లభిస్తోంది, ఇందులో మీకు 64 MP  ప్రధాన కెమెరా లభిస్తోంది, ఇది కాకుండా మీరు 8MP  అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌ తో పాటుగా  ఒక 13MP టెలిఫోటో లెన్స్‌తో పాటు 2MP డెప్త్ సెన్సార్‌ను కూడా పొందుతున్నారు. ఇది కాకుండా, మీరు ఫోన్‌లో ఇన్ డిస్ప్లే వేలిముద్ర సెన్సార్‌ను కూడా అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo