Realme X2 మొదటి సేల్ రేపు జరగనుంది

Realme X2 మొదటి సేల్ రేపు జరగనుంది
HIGHLIGHTS

ఈ ప్రత్యేకతలతో వచ్చిన స్మార్ట్ ఫోన్లలో ఇదే అత్యంత చౌకైన స్మార్ట్ ఫోనుగా చెప్పొచ్చు.

ఇటీవల, రియల్మీ సంస్థ  గొప్ప ప్రత్యేకతలతో ఇండియాలో విడుదల చేసినటువంటి, Realme X2 స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ రేపు జరగనుంది. ఈ రియల్మీ X2 వెనుక ఒక  64MP క్వాడ్ కెమెరాతో మరియు స్నాప్ డ్రాగన్ 730G గేమింగ్ ప్రాసెసర్ తో ఇండియలో లాంచ్ అయ్యింది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ గేమింగ్ కోసం ప్రత్యేకంగా తీసుకోచ్చిన ప్రాసెసర్ వచ్చింది మరియు  కేవలం రూ.16,999 రూపాయల ప్రారంభ ధరతో ప్రకటించబడింది. అంతేకాదు, ఈ ప్రత్యేకతలతో వచ్చిన స్మార్ట్ ఫోన్లలో ఇదే అత్యంత చౌకైన స్మార్ట్ ఫోనుగా చెప్పొచ్చు.

Realme X2 ధరలు

1. Realme X2  (4GB + 64GB) ధర – Rs.16,999

2. Realme X2 (6GB + 128GB) ధర – Rs.18,999

3. Realme X2 (8GB + 128GB) ధర – Rs.19,999

ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ డిసెంబర్ 20 తేదికి Flipakrt మరియు realme.com నుండి జరగనుంది.  

Realme X2 : ప్రత్యేకతలు

Realme X2 స్మార్ట్ ఫోన్ ఒక మిడ్-రేంజ్ హ్యాండ్‌సెట్ గా ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇది గరిష్టంగా 2.2 GHz వరకూ క్లాక్ స్పీడ్ అందించగల ఒక క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730G SoC యొక్క శక్తిని కలిగి ఉంది. ఇది 8nm ఫ్యాబ్రికేషన్ ప్రాసెసర్ కాబట్టి, స్మార్ట్ ఫోన్ చాలా వేగంగా మరియు స్మూత్ గా పనిచేస్తుంది. ఇక స్క్రీన్ విషయానికి వస్తే, ఒక 6.4-అంగుళాల Full HD + Super AMOLED డిస్ప్లేని 91.9 శాతం స్క్రీన్ టూ బాడీ నిష్పత్తితో కలిగి ఉంది. ఈ డిస్ప్లేలో వాటర్‌డ్రాప్ నోచ్ డిజైన్ ఉంది, ఇందులో  సెల్ఫీ కెమెరా ఉంచబడుతుంది మరియు వేగవంతమైన ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సారుతో అవస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్, వెనుక ఒక ప్రత్యేకమైన 3D గ్లాస్ డిజైన్ కలిగి ఉంది, ఇది పెరల్ గ్రీన్, పెరల్ బ్లూ మరియు పెరల్ వైట్ కలర్ ఎంపికలతో వస్తుంది.

ఆప్టిక్స్ పరంగా, రియల్మి X2  వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ తో ఉంటుంది. ఇది f / 2.25 ఎపర్చరు లెన్స్ మరియు 119 డిగ్రీల ఫీల్డ్ వ్యూతో ఒక 8 ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ కలిగి ఉంటుంది. దీనికి జతగా 64MP ప్రాధమిక సెన్సార్‌ తో పాటు, F / 2.4 లెన్స్‌తో 2MP పోర్ట్రెయిట్ లెన్స్ మరియు f / 2.4 మాక్రో లెన్స్‌తో 2MP కెమెరా కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్, మెరుగైన Low -Light చిత్రాలను కూడా అందిస్తుంది. ముందు భాగంలో 32MP సెన్సార్, ఒక f / 2.0 ఎపర్చర్‌తో ఉంటుంది.

రియల్మీ X2 గరిష్టంగా 8 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ లో హైపర్‌బూస్ట్ 2.0 అమర్చారు, ఇది గేమింగ్ ఆడేటప్పుడు మరింత మధురానుభూతిని అందిస్తుంది. అలాగే, ఒక 4000mAh బ్యాటరీతో మద్దతు ఉన్నఈ హ్యాండ్‌సెట్ టైప్-సి పోర్ట్‌ను కలిగి ఉంది మరియు 30 వాట్స్  VOOC 4.0 ఛార్జింగ్‌ కు మద్దతు ఇస్తుంది. ఈ VOOC ఛార్జింగ్ 70 నిమిషాల్లో హ్యాండ్‌సెట్ బ్యాటరీని 100 శాతం నింపుతుంది.         

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo