మిడ్ రేంజ్ సంచలనమైన REALME X ఇండియాలో విడుదలకానుంది.

Updated on 17-May-2019
HIGHLIGHTS

REALME X మరియు REALME స్ Lite స్మార్ట్ ఫోన్లు సంచనాలు సృష్టించాయి.

ఇటీవల ప్రీమియం ఫీచర్లతో కేవలం మిడ్ రేంజ్ ధరలో చైనాలో విడుదల చేసినటువంటి  REALME X మరియు REALME స్ Lite స్మార్ట్ ఫోన్లు సంచనాలు సృష్టించాయి. ఇందులో ముఖ్యముగా, REALME X కేవలం మిడ్ రేంజ్ ధరలో పూర్తిగా ప్రీమియం ఫీచర్లను తీసుకురాగా లైట్ వర్షన్ మాత్రం బడ్జెట్ ధరలో బెస్ట్ కెమెరాలను తీసుకొస్తుంది. ఇక ఈ ఫోన్లను ఇండియాలో అతిత్వరలోనే లాంచ్ చేయనున్నట్లు, రియల్మీఇండియా CEO అయినటువంటి,  మాధవ్ సేథ్ తన ట్విట్టర్ పేజీలో ప్రకటించారు. 

 

https://twitter.com/MadhavSheth1/status/1128600414176235520?ref_src=twsrc%5Etfw

 

REALME X ప్రత్యేకతలు

రియల్మీ సంస్థ ఈ స్మార్ట్ ఫోనులో 6.53 అంగుళాల FHD+  శామ్సంగ్ AMOLED డిస్ప్లేను ఇందులో అందించింది. అలాగే, ఇందులో ఎటువంటి నోచ్ డిజైన్ లేకుండా పూర్తి స్క్రీన్ తో దీన్ని అందించింది. అంతేకాదు, ఈ డిస్ప్లేలో ఒక ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సారును కూడా అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 710 ఆక్టా కోర్ ప్రాసెసర్ కి జతగా 4GB /6GB మరియు హై ఎండ్ వేరియంట్ 8GB శక్తితో పనిచేస్తుంది. అలాగే, 64GB మరియు 128GB స్టోరేజి ఎంపికలతో లభిస్తుంది. అధనంగా, వేగవంతమైన ఛార్జింగ్ కోసం VOOC 3.0 ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలిజీతో కూడిన 3,750 mAh బ్యాటరీతో వస్తుంది.

ఇక కెమేరాల విభాగానికి వస్తే, ఇందులో ప్రధాన కెమేరాని ఒక 48MP సోనీ IMX586 సెన్సారు కి జతగా 5MP కెమేరాని కలిపి డ్యూయల్ రియర్ కెమేరా సెటప్పుతో అందించింది. ముందు  ఒక 16MP సోనీ IMX 471 సెన్సార్ పాప్ అప్ సెల్ఫీ కెమెరాని ఇందులో ఇచ్చింది. అలాగే, గేమింగ్ కోసం హైపర్ బూస్ట్ 2.0 ని ఇందులో ఇచ్చింది. పంక్ బ్లూ మరియు స్టీమ్ వైట్ వంటి రంగులలో లభించనుంది. అధనంగా, Dolby Atmos సపోర్టును కూడా ఇందులో అందించింది.   

ఇక ధర విషయానికి వస్తే, చైనాలో RealMe X యొక్క 4GB ర్యామ్ 64GB స్టోరేజి వేరియంట్ CNY 1,499 (సుమారు Rs 15,300) ధరతో విడుదలయ్యింది. అలాగే, మరొక 6GB ర్యామ్ 64GB స్టోరేజి వేరియంట్ CNY 1,599 (సుమారు Rs 16,300) ధరతో మరియు అత్యంత అధికమైన వేరియంట్ అయినా 8GB ర్యామ్ 128GB స్టోరేజి వేరియంట్ CNY 1,799 (సుమారు Rs 18,300) ధరతో విడుదలచేసింది.                   

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :