రియల్మీ కొత్త NARZO సిరీస్ టీజర్ అందించింది : వేగం, బెస్ట్ కెమేరాలు మరియు మరిన్ని..
ఇండియాలో చాలా వేగంగా, అతితక్కువ వ్యవధిలో ఫోన్లను తీసుకొస్తున్న బ్రాండ్ ఏదంటే, రియల్మీ అని ఠక్కున చెప్పొచ్చు. అంతేకాదు, కొన్ని స్మార్ట్ ఫోన్లను ఇండస్ట్రీ ఫస్ట్ గా తీసుకొచ్చింది. ఇండియాలో మొదటి 5G స్మార్ట్ ఫోన్ను తీసుకొచ్చిన మొట్టమొదటి సంస్థగా కూడా రియల్మీ నే నిలచింది. ఇప్పుడు, కొత్తగా తన అధికారిక ట్విట్టర్ ద్వారా ఒక టీజర్ ని విడుదల చేసింది. రీయల్మీ, ఈ టీజర్ ద్వారా ఒక కొత్త సిరీస్ ని ఇండియాలో విడుదల చేయనున్నట్లు చూపిస్తోంది.
Surveyఇక ఈ టీజర్ గురించి ముఖ్యంగా ఏమిచెబుతుందంటే, మూడు విషయా విషయాలను హైలైట్ చేసి చూపిస్తోంది. అవేమిటంటే, యూనిక్, ఎక్స్ట్రాడినరీ మరియు బోల్డ్ అని పేర్కొంది. అంటే, ఈ సిరిస్ ప్రత్యేకమైన, సూపర్ ఫీచర్లు కలిగిన పెద్ద స్మార్ట్ ఫోన్లను తీసుకురావచ్చని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి, ఇటీవల తీసుకొచ్చిన రియల్మీ 6 సిరీస్ కూడా మంచి ఫీచర్లతో లాంచ్ చేయబడ్డాయి. ఈ స్మార్ట్ ఫోన్లు విడుదల చేసిన వెంటనే మరొక కొత్త సిరీస్ గురించి టీజింగ్ చేస్తోందంటే, ఇదికొంచం, ఇతర స్మార్ట్ ఫోన్ సంస్థలకు గట్టి పోటీని ఇచ్చే స్మార్ట్ ఫోన్లను ఈ సిరీస్ ద్వారా లాంచ్ చేయవచ్చేమోనని కూడా భవిస్తున్నారు భావిస్తున్నారు.
Unique. Extraordinary. Bold.
Words that define you, words that define it.
Get ready to #FeelThePower, with the new smartphone series, the #realmeNarzo!
Stay tuned to know more.https://t.co/fMrX6tbyLb pic.twitter.com/g9VhNGpS0N— realme (@realmemobiles) March 19, 2020
అంటే, ప్రస్తుతం మిడ్ రేంజ్ విభాగాన్ని టార్గెట్ చేసుకొని అన్నిప్రధాన సంస్థలు కూడా స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. ఇదే విభాగంలో, ఇప్పటికే POCO, షావోమి మరియు రియల్మీ పోటాపోటీగా నడుస్తుండగా, శామ్సంగ్ కూడా ఇదే విభాగాల్లో తన M సిరీస్ స్మార్ట్ ఫోన్లతో పోటీనిస్తోంది. కాబట్టి, ఇప్పుడు రియల్మీ టీజర్ చూస్తుంటే గొప్ప ఫీచర్లను కలిగిన ఫోన్లను ఈ సిరీస్ ద్వారా లాంచ్ తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇవన్నీ కూడా అంచనాలు మాత్రమే ఈ ఫోన్లు ఎటువంటి ఫీచర్లతో వస్తాయో చూడానికి మాత్రం లాంచ్ అయ్యే వరకూ ఎదురుచూడాల్సిందే.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
