కరోనా ఎఫెక్ట్ : వాయిదాపడిన రియల్మీ Narzo సిరీస్ లాంచ్

కరోనా ఎఫెక్ట్ : వాయిదాపడిన రియల్మీ Narzo సిరీస్ లాంచ్
HIGHLIGHTS

రియల్మీ ఉద్యోగులకు ఇంటి నుండే పని చేసే సౌకర్యం లభిస్తుందని కూడా ప్రకటిచారు.

రియల్మి యొక్క నార్జో స్మార్ట్‌ ఫోన్ సిరీస్ మార్చి 26 న అంటే ఈరోజు ఇండియాలో విడుదల చెయ్యడానికి డేట్ ప్రకటించింది. అయితే,  వేగంగా వ్యాప్తి చెందుతున్న మహమ్మారి కరోనా వైరస్ కారణంగా ఈ కార్యక్రమం ఆగిపోయింది. ఈ కొత్త స్మార్ట్‌ ఫోన్ల అమ్మకం కూడా నిలిపివేస్తున్నట్లు కంపెనీ సీఈఓ మాధవ్ శేత్ ప్రకటించారు, కానీ ఇప్పుడు ట్వీట్ల ద్వారా వారు నార్జో సిరీస్‌తో సహా రాబోయే అన్ని లాంచ్‌ కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా రియల్మీ  యొక్క తయారీ సౌకర్యం ప్రభుత్వ తదుపరి నోటీసు వరకు మూసివేయబడుతుందని మాధవ్ సేథ్ తన మొదటి ట్వీట్‌ లో పేర్కొన్నారు. చివరగా, రియల్మీ ఉద్యోగులకు ఇంటి నుండే పని చేసే సౌకర్యం లభిస్తుందని కూడా ప్రకటిచారు.

మొదట కంపెనీ మార్చి 26 న ఫోన్లను ప్రవేశపెడుతునాట్లు ప్రకటించింది. అయితే, దేశవ్యాప్తంగా జరుగుతున్నా లాక్ డౌన్  ముగిసిన తారువాత ఈ ఫోన్లు సెల్‌ చెయ్యబడతాయని భావిస్తున్నారు. అయితే, ఇప్పుడు లాంచ్‌ను రద్దు చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. రియల్మి యొక్క మేక్ ఇన్ ఇండియా యూనిట్ కూడా  మూసివేయబడుతుంది.

మీరు ఈ ఫోనులో ఒక 6.5-అంగుళాల స్క్రీన్నుఒక 89.8% స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో ఇవ్వనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. దీనితో పాటు, ఒక పెద్ద 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని కూడా అందుకుంటారు. ఈ నార్జో 10 ఇటీవల మయన్మార్ మార్కెట్లో విడుదల చేసిన రియల్మే 6i యొక్క రీబ్రాండెడ్ వెర్షన్ అని కూడా చెబుతున్నారు.

ఇది కాకుండా, మేము నార్జో 10A గురించి మాట్లాడితే, ఇది దాదాపు ఇండోనేషియా మార్కెట్లో లాంచ్ అయిన రియల్మే c3 లాగా కనిపిస్తుంది. అనేక కొత్త ఫీచర్లతో కూడిన రియల్మి సి 3 యొక్క వేరే వెర్షన్ భారతదేశంలో లాంచ్ అవుతోందని కూడా చెప్పవచ్చు. ఈ మొబైల్ ఫోనులో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉన్నట్లు కూడా చూపిస్తోంది.

ఇక ఇటీవల ప్రారంభించిన రియల్మి 6i స్మార్ట్‌ఫోన్‌ గురించి చర్చిస్తే, ఈ మొబైల్ ఫోనులో రియల్మిUI లో ఆండ్రాయిడ్ 10 తో పాటుగా డ్యూయల్ సిమ్‌ తో వచ్చింది. ఇది 720 x 1600 పిక్సెల్స్ రిజల్యూషన్ మరియు 20: 9 యొక్కఆస్పెక్ట్ రేషియా గల  ఒక 6.5-అంగుళాల FHD స్క్రీన్ కలిగి ఉంది. ఈ ఫోన్‌ కు మీడియాటెక్ హెలియో జి 80 SoC  శక్తినిస్తుంది. మాలి జి 52 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (GPU) గ్రాఫిక్స్ కోసం ఈ ఫోనులో ఉంచబడింది. ఈ ఫోనులో 3 జీబీ మరియు 4 జీబీ ర్యామ్ ఉంది.

కెమెరా గురించి మాట్లాడితే, ఈ రియల్మి 6i లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది, దీనిలో 48 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది మరియు ఇది  f / 1.8 ఎపర్చరుతో వస్తుంది. రెండవ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ మరియు 2MP బ్లాక్ అండ్ వైట్ పోర్ట్రెయిట్ లెన్స్ మరియు 2MP మాక్రో లెన్స్ లభిస్తుంది. ముందు కెమెరా విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోనుకు ముందు 16 మెగాపిక్సెల్ షూటర్ లభిస్తుంది, ఇది ఎపర్చరు ఎఫ్ / 2.0 కలిగి ఉంటుంది మరియు వాటర్ డ్రాప్ నోచ్ లో ఉంటుంది. ఇది 64 జిబి మరియు 128 జిబి వంటి రెండు  స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుంది  మరియు మైక్రో ఎస్డి కార్డుతో 256 జిబి వరకూ పెంచవచ్చు. కనెక్టివిటీ కోసం యుఎస్‌బి టైప్-సి పోర్ట్, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్ మరియు 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ అందించబడ్డాయి.

Realme 6i లో 5,000WAh బ్యాటరీ ఉంది, ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఫోన్ యొక్క కొలత 164.40×75.40×9.00 మిమీ మరియు దీని బరువు 195 గ్రాములు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo