Realme P4x 5G First Sale: ఈ ఫోన్ ను తక్కువ ధరలో పొందాలంటే ఫస్ట్ సేల్ మిస్సవ్వకండి.!

HIGHLIGHTS

రియల్ మీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ రియల్ మీ పి4x ఫస్ట్ సేల్ రేపు స్టార్ట్ అవుతుంది

Realme P4x 5G First Sale రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ ఫస్ట్ సేల్ మొదలవుతుంది

ఈ లేటెస్ట్ ఫోన్ ను తక్కువ ధరలో పొందాలంటే ఫస్ట్ సేల్ మిస్సవ్వకండి

Realme P4x 5G First Sale: ఈ ఫోన్ ను తక్కువ ధరలో పొందాలంటే ఫస్ట్ సేల్ మిస్సవ్వకండి.!

Realme P4x 5G First Sale: రియల్ మీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ రియల్ మీ పి4x ఫస్ట్ సేల్ రేపు స్టార్ట్ అవుతుంది. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ ఫస్ట్ సేల్ మొదలవుతుంది మరియు అర్ధరాత్రి 12 గంటలకు క్లోజ్ అవుతుంది. ఈ లేటెస్ట్ ఫోన్ ను తక్కువ ధరలో పొందాలంటే ఫస్ట్ సేల్ మిస్సవ్వకండి. ఎందుకంటే, ఈ ఫోన్ ఫాస్ట్ సేల్ నుంచి ఈ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ రియల్ మీ అనౌన్స్ చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme P4x 5G First Sale: ఫస్ట్ సేల్ ఆఫర్స్ ఏమిటి?

ఈ ఫోన్ లాంచ్ సమయంలో కంపెనీ ఈ ఫోన్ పై ఫస్ట్ సేల్ లాంచ్ ఆఫర్స్ అనౌన్స్ చేసింది. కంపెనీ ప్రకారం, ఈ ఫోన్ లేటెస్ట్ ఫోన్ పై రూ. 500 కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 2,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ రెండు ఆఫర్లు అనౌన్స్ చేసింది. ఈ రెండు ఆఫర్లు కూడా రేపు జరిగే మొదటి సేల్ ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్ ఫాస్ట్ సేల్ డిసెంబర్ 10వ తేదీ అనగా రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. Flipkart మరియు రియల్ మీ అధికారిక వెబ్ సైట్ నుండి సేల్ కి అందుబాటులో ఉంటుంది.

Realme P4x 5G
Realme P4x 5G

ఇక ఈ ఫోన్ ప్రైస్ విషయానికి వస్తే, ఈ ఫోన్ బేసిక్ (6 జీబీ + 128 జీబీ) వేరియంట్ ధర రూ. 15,499, రెండో (6 జీబీ + 128 జీబీ) వేరియంట్ ధర రూ. 16,999 మరియు హైఎండ్ (8 జీబీ + 256 జీబీ) వేరియంట్ ధర రూ. 18,999 గా ఉంటుంది.

Realme P4x 5G : ఫీచర్స్

ఈ రియల్ మీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 6.72 ఇంచ్ బిగ్ LCD స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ FHD + (1080 x 2400) రిజల్యూషన్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో పాటు 144Hz గొప్ప రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7400 Ultra 5G ప్రోసెసర్ జతగా 8 జీబీ ఫిజికల్ ర్యామ్ మరియు 10 జీబీ డైనమిక్ ర్యామ్ ఫీచర్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 128జీబీ మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ అందించింది. ఇక డిజైన్ పరంగా, ఈ ఫోన్ MIL 810H సర్టిఫికేషన్ కలిగిన మిలటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో ఉంటుంది.

రియల్ మీ పి4x ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇందులో AF సపోర్ట్ కలిగిన 50MP EIS ప్రధాన సెన్సార్ మరియు 2MP IR లెన్స్ ఉంటాయి. ఈ ఫోన్ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. 30FPS 4K వీడియో రికార్డ్, AI కెమెరా ఫీచర్స్ మరియు టన్నుల కొద్దీ రియల్ మీ ఫోటో ఫీచర్స్ కూడా ఈ ఫోన్ కలిగి ఉంటుంది.

Also Read: Realme Narzo 90 5G: న్యూ లుక్ మరియు బిగ్ బ్యాటరీతో వచ్చే వారం లాంచ్ అవుతుంది.!

ప్రస్తుతం ట్రెండ్ గా నడుస్తున్న 7000 mAh టైటాన్ బిగ్ బ్యాటరీ ఈ ఫోన్ లో అందించింది. అలాగే, ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో అందించింది. ఈ ఫోన్ IP 64 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo