Realme Narzo 90 5G: న్యూ లుక్ మరియు బిగ్ బ్యాటరీతో వచ్చే వారం లాంచ్ అవుతుంది.!
రియల్ మీ నార్జో 90 సిరీస్ నుంచి రెండు కొత్త ఫోన్లు అనౌన్స్ చేసింది
ఈ సిరీస్ నుంచి రియల్ మీ నార్జో 90 5జి మరియు రియల్ మీ నార్జో 90x 5జి రెండు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి
రియల్ మీ నార్జో 90 5జి స్మార్ట్ ఫోన్ న్యూ లుక్ మరియు బిగ్ బ్యాటరీతో అవుతుంది
Realme Narzo 90 5G: రియల్ మీ నార్జో 90 సిరీస్ నుంచి రెండు కొత్త ఫోన్లు అనౌన్స్ చేసింది. ఈ సిరీస్ నుంచి రియల్ మీ నార్జో 90 5జి మరియు రియల్ మీ నార్జో 90x 5జి రెండు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా వచ్చే వారం ఇండియాలో లాంచ్ అవుతాయి. వీటిలో రియల్ మీ నార్జో 90 5జి స్మార్ట్ ఫోన్ న్యూ లుక్ మరియు బిగ్ బ్యాటరీతో అవుతుంది.
SurveyRealme Narzo 90 5G: ఎప్పుడు లాంచ్ అవుతుంది?
రియల్ మీ నార్జో 90 5జి సిరీస్ ఫోన్లు డిసెంబర్ 16న ఇండియాలో లాంచ్ అవుతున్నాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా అమెజాన్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తాయి. వీటిలో రియల్ మీ నార్జో 90 5జి ఫోన్ స్టాండర్డ్ వేరియంట్ అవుతుంది మరియు ఈ సిరీస్ ప్రీమియం ఫోన్ అవుతుంది.
Realme Narzo 90 5G: ఫీచర్స్
రియల్ మీ నార్జో 90 5జి స్మార్ట్ ఫోన్ విక్టరీ పవర్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ న్యూ లుక్ తో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ చాలా స్లీక్ ఉన్నట్లు కూడా మనం చూడవచ్చు. ఈ ఫోన్ లాంచ్ అయ్యే ప్రైస్ సెగ్మెంట్ లో 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన ఫోన్ గా ఉంటుందని రియల్ మీ టీజింగ్ చేస్తోంది.

కెమెరా పరంగా, ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇది డ్యూయల్ 50MP కెమెరాలు కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. అయితే, ఇందులో 50MP మెయిన్ మరియు 50MP సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇదే కాదు ఈ ఫోన్ లో Ai Edit Gene మరియు Ai ఎడిటర్ సపోర్ట్ ఉంటుంది. అంటే, ఈ ఫోన్ లో టన్నుల కొద్దీ ఎఐ కెమెరా ఫీచర్స్ ఉంటాయి.
ఈ ఫోన్ భారీ బ్యాటరీ సెటప్ తో లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ తెలిపింది. ఈ ఫోన్ లో 7000 mAh బిగ్ టైటాన్ బ్యాటరీ తో వస్తుంది మరియు ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 60W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో ఉంటుంది. ఈ ఫోన్ లో గేమింగ్ సమయంలో అవసరమైన బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు ఇతర పరికరాలు ఛార్జ్ చేయడానికి అవసరమైన రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంటుంది.
Also Read: Flipkart Buy Buy 2025 Sale నుంచి 5 వేల ధరలో జబర్దస్త్ Dolby Soundbar అందుకోండి.!
ఈ ఫోన్ మంచి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ గా లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ IP66, IP68 మరియు IP69 రేటింగ్ తో మంచి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ గా ఇండియాలో లాంచ్ అవుతుంది.