Realme P4R 5G complete features know before launch
రియల్‌మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Realme P4R 5G రేపు ఇండియాలో లాంచ్ అవుతుంది. అయితే, ఈ ఫోన్ లాంచ్ కంటే ఒకరోజు ముందే ఈ ఫోన్ కంప్లీట్ స్పెక్స్ అండ్ ఫీచర్స్ మీ ముందు ఉంచుతున్నాను. ఈ ఫోన్ ను మిడ్ రేంజ్ బీస్ట్ గా లాంచ్ చేస్తున్నట్లు రియల్‌మీ పేర్కొంది. మార్కెట్ లీడింగ్ భారీ బ్యాటరీ మరియు అద్భుతమైన AI ఫీచర్స్ తో ఈ ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్లు కూడా రియల్‌మీ ఈ ఫోన్ గురించి గొప్పగా చెబుతోంది.
ఈ రియల్‌మీ పి4 ఆర్ స్మార్ట్ ఫోన్ జూన్ 10వ తేదీ అనగా రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ తర్వాత ఫ్లిప్ కార్ట్ మరియు కంపెనీ అఫీషియల్ సైట్ నుంచి సేల్ అవుతుంది.
ఈ స్మార్ట్ ఫోన్ ను సెగ్మెంట్ లో బిగ్గెస్ట్ బ్యాటరీ ఫోన్ గా లాంచ్ చేస్తున్నట్లు రియల్‌మీ ప్రకటించింది. ఇందులో, 8000 mAh భారీ బ్యాటరీ ఉంటుంది. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా కూడా ఈ ఫోన్ కేవలం 8.8mm స్లీక్ డిజైన్ తో ఉంటుంది. ఇక ఛార్జ్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 45W ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్, బైపాస్ ఛార్జ్ మరియు 27W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంది. అంతేకాదు, ఈ ఫోన్ డ్యూరబిలిటీలో కూడా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే, ఈ ఫోన్ MIL STD 810H మిలటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కలిగి ఉంది.
రియల్‌మీ పి4 ఆర్ MediaTek Dimensity 6300 చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. ఇందులో న 14GB వరకు డైనమిక్ ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వంటి ఫీచర్స్ కూడా ఉంటాయి. ఈ ఫోన్ లో గేమింగ్ కోసం తగిన 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 1200 నిట్స్ బ్రైట్నెస్ కలిగిన పెద్ద స్క్రీన్ తో ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ను వేగంగా చల్లబరిచే ఎయిర్ ఫ్లో వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం కూడా ఈ ఫోన్ లో ఉంది. అంటే, గేమింగ్ మరియు మల్టీ టాస్కింగ్ సమయంలో కూడా ఈ ఫోన్ చల్లగా ఉంచే సెటప్ ఉంది.
Also Read: LPG Cylinder యూజర్లకు షాకింగ్ న్యూస్ .. Ujjwala Yojana సబ్సిడీ సిలిండర్ కోటా కుదింపు.!
ఇక కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 50MP AI డ్యూయల్ రియర్ కెమెరాని అందించింది. ఈ కెమెరాని మరింత అందంగా మలిచే Ai పల్స్ లైట్ ని కూడా అందించింది. ఈ ఫోన్ Ai పోర్ట్రైట్ గ్లో మరియు Ai ఎరేజర్ చాలా Ai కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో బిల్ట్ జెమినీ సపోర్ట్ ఉంటుంది మరియు ఈ ఫీచర్ తో ఫోటోలు మరింత గొప్పగా అందుకునే అవకాశం ఉంటుంది.