రిలీజ్ కంటే ముందే Realme P4R 5G కంప్లీట్ స్పెక్స్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!

HIGHLIGHTS

రియల్‌మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Realme P4R 5G రేపు ఇండియాలో లాంచ్ అవుతుంది

ఒకరోజు ముందే ఈ ఫోన్ కంప్లీట్ స్పెక్స్ అండ్ ఫీచర్స్ మీ ముందు ఉంచుతున్నాను

అద్భుతమైన AI ఫీచర్స్ తో ఈ ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు కూడా రియల్‌మీ గొప్పగా చెబుతోంది

రిలీజ్ కంటే ముందే Realme P4R 5G కంప్లీట్ స్పెక్స్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!

రియల్‌మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Realme P4R 5G రేపు ఇండియాలో లాంచ్ అవుతుంది. అయితే, ఈ ఫోన్ లాంచ్ కంటే ఒకరోజు ముందే ఈ ఫోన్ కంప్లీట్ స్పెక్స్ అండ్ ఫీచర్స్ మీ ముందు ఉంచుతున్నాను. ఈ ఫోన్ ను మిడ్ రేంజ్ బీస్ట్ గా లాంచ్ చేస్తున్నట్లు రియల్‌మీ పేర్కొంది. మార్కెట్ లీడింగ్ భారీ బ్యాటరీ మరియు అద్భుతమైన AI ఫీచర్స్ తో ఈ ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్లు కూడా రియల్‌మీ ఈ ఫోన్ గురించి గొప్పగా చెబుతోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme P4R 5G : లాంచ్

ఈ రియల్‌మీ పి4 ఆర్ స్మార్ట్ ఫోన్ జూన్ 10వ తేదీ అనగా రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ తర్వాత ఫ్లిప్ కార్ట్ మరియు కంపెనీ అఫీషియల్ సైట్ నుంచి సేల్ అవుతుంది.

Realme P4R 5G : స్పెక్స్ అండ్ ఫీచర్స్

ఈ స్మార్ట్ ఫోన్ ను సెగ్మెంట్ లో బిగ్గెస్ట్ బ్యాటరీ ఫోన్ గా లాంచ్ చేస్తున్నట్లు రియల్‌మీ ప్రకటించింది. ఇందులో, 8000 mAh భారీ బ్యాటరీ ఉంటుంది. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా కూడా ఈ ఫోన్ కేవలం 8.8mm స్లీక్ డిజైన్ తో ఉంటుంది. ఇక ఛార్జ్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 45W ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్, బైపాస్ ఛార్జ్ మరియు 27W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంది. అంతేకాదు, ఈ ఫోన్ డ్యూరబిలిటీలో కూడా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే, ఈ ఫోన్ MIL STD 810H మిలటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కలిగి ఉంది.

Realme P4R 5G

రియల్‌మీ పి4 ఆర్ MediaTek Dimensity 6300 చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. ఇందులో న 14GB వరకు డైనమిక్ ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వంటి ఫీచర్స్ కూడా ఉంటాయి. ఈ ఫోన్ లో గేమింగ్ కోసం తగిన 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 1200 నిట్స్ బ్రైట్నెస్ కలిగిన పెద్ద స్క్రీన్ తో ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ను వేగంగా చల్లబరిచే ఎయిర్ ఫ్లో వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం కూడా ఈ ఫోన్ లో ఉంది. అంటే, గేమింగ్ మరియు మల్టీ టాస్కింగ్ సమయంలో కూడా ఈ ఫోన్ చల్లగా ఉంచే సెటప్ ఉంది.

Also Read: LPG Cylinder యూజర్లకు షాకింగ్ న్యూస్ .. Ujjwala Yojana సబ్సిడీ సిలిండర్ కోటా కుదింపు.!

ఇక కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 50MP AI డ్యూయల్ రియర్ కెమెరాని అందించింది. ఈ కెమెరాని మరింత అందంగా మలిచే Ai పల్స్ లైట్ ని కూడా అందించింది. ఈ ఫోన్ Ai పోర్ట్రైట్ గ్లో మరియు Ai ఎరేజర్ చాలా Ai కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో బిల్ట్ జెమినీ సపోర్ట్ ఉంటుంది మరియు ఈ ఫీచర్ తో ఫోటోలు మరింత గొప్పగా అందుకునే అవకాశం ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile